మహేశ్ స్పైడర్ కు రూ.25 కోట్లు

బయో వార్ .. ఇప్పటివరకు దేశంలో ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్ ను దర్శకుడు మురగదాస్ ఎంచుకున్నారు. మురగదాస్ ఎంచుకునే కథలే చాలా ప్రత్యేకం.. 7th sense మూవీలో కూడా చైనాలో కరాటే విద్యను నేర్పిన దక్షిణ భారతీయుడు భోది ధర్మ విశేషాలను సినిమా గా తీసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. మహేశ్ తో కూడా రోబోటిక్ బయో వార్ ను కథాంశంగా ఎంచుకున్నారు. ఇలాంటి మంచి కథ కథనంతో సినిమా చేస్తున్న మురగదాస్ సినిమా ప్రమోషన్ లో మాత్రం ఘోరం ఫెయిలయ్యాడని మహేశ్ అభిమానులు మథన పడుతున్నారు..

ఇంతమునుపు మురగదాస్ తమిళంలో తీసిన కత్తి, తుపాకీ వంటి సినిమాలకు విపరీతమైన ప్రచారం కల్పించారు. సినిమా పోస్టర్లు, స్టిల్స్ విడుదల చేసి హైప్ సృష్టించాడు. కానీ స్పైడర్ కు సంబంధించిన ఏ ఒక్క పోస్టర్, విశేషాలు అభిమానులకు విడుదలకాకపోవడంపై మహేశ్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. కనీసం స్పైడర్ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. మహేశ్ తీస్తున్న స్పైడర్ సినిమాకు సంబంధించిన టీజర్ తప్ప ఇంకేవీ మురగదాస్ విడుదల చేయలేదు.

తాజాగా స్పైడర్ మూవీకి తమిళంలో కళ్లు చెదిరే రేట్స్ వచ్చాయి. ఈ మూవీ తమిళ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. దాదాపు రూ.25 కోట్లు ముట్టజెప్పి చేజిక్కించుకున్నట్టు ప్రకటించారు. మహేశ్ బాబు కెరీర్ లోనే ఒక పరభాష తమిళంలో ఇంత రేట్ పెట్టిన మూవీ ఇంకోటి లేదట.. ఈ సందర్భంగా మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేయాలని మురగదాస్ ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

To Top

Send this to a friend