బయో టెర్రరిజం.. మహేశ్, మురగదాస్


మహేశ్ బాబు-మురగదాసు జోడి కట్టగానే టాలీవుడ్, కోలీవుడ్ షాక్ కు గురైంది. మహేశ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్., అందగాడు. మురగదాస్ విలక్షణ చిత్రాలతో ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన దర్శకుడు. వీరిద్దరు కలిసి సినిమా తీస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి అనుగుణంగా స్పైడర్ టీజర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

స్పైడర్ టీజర్ విడుదలయ్యాక తెలుగులో సినిమా హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.. ఇప్పుడు సినిమా ట్రైలర్ చూశాక తమిళంలో స్పైడర్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తమిళంలో స్పైడర్ కోసం ఓ బడా నిర్మాత 18 కోట్ల భారీ మొత్తానికి మురగదాసు బృందానికి ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతుండడంతో మరింత బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా కథాంశం విషయానికి వస్తే మురగదాసు షరామామూలుగానే ఇప్పటివరకు దేశంలో ఎవ్వరూ టచ్ చేయని బయో టెర్రరిజం కథాంశాన్ని తీసుకున్నారని తెలిసింది. ఇందులో పోలీస్ గా మహేశ్ నటిస్తున్నారు. సందేశాత్మకంతో పాటు బయో వార్ కథతో ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు మురగ రెడీ అవుతున్నారు. దసరాకు విడుదలయ్యే మహేశ్ , మురగ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

To Top

Send this to a friend