బిగ్ ఎలిమినేటర్ ఎవరంటే..

బిగ్ బాస్ తొలివారం పూర్తయ్యింది. గత ఆదివారం ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ షోకు వారం పూర్తికావడంతో శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ మరోసారి బిగ్ బాస్ హౌస్ వద్దకు వచ్చి కంటెస్టెంట్ లతో మాట్లాడారు.. ఈ సందర్భంగా బిగ్ హౌస్ లోంచి ఒకరిని పంపించేందుకు రంగం సిద్ధమైంది.. బిగ్ ఎలిమినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైనట్టు ఎన్టీఆర్ తెలిపారు.. రేపు ఇంటిలోంచి ఒకరు బయటకు వెళ్లిపోతారు.

బిగ్ బాస్ లోని మెజార్టీ సెలబ్రెటీ సభ్యులు ఎవరినైతే నామినేట్ చేస్తారో వారే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారు. కాగా అందరి అభిప్రాయాలను విన్న బిగ్ బాస్ ఈ షో నుంచి ఎక్కువ మంది చెప్పిన పేర్లను నామినేట్ చేసి బయటకు పంపిస్తాడు.. ఇందులో మొదటగా మధుప్రియ, హరితేజ, మహేశ్ కత్తి, కత్తి కార్తీక, జ్యోతిక పేర్లను బిగ్ బాస్ నామినేట్ చేశారు. ప్రేక్షకులు తమ ఓటు హక్కు ద్వారా బిగ్ బాస్ లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నామినేట్ చేయొచ్చు.. ఈ ఐదుగురులోంచి అందరూ వ్యతిరేకించిన అభ్యర్థిని బిగ్ బాస్, ఎన్టీఆర్ కలిసి బయటకు పంపుతారు.

ఇందులో ఎక్కువగా అందరూ నామినేట్ చేసింది మహేశ్ కత్తినే..వచ్చినప్పటి నుంచి ఏ పని చేయకుండా ఒకే చోటు స్తబ్దుగా కూర్చుంటూ బోర్ కొట్టిస్తున్నాడు. అతడి పేరును అందుకే అందరూ నామినేట్ చేశారు. అందరూ నామినేట్ చేసిన లెక్క ప్రకారం వయసు భారంతో ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటున్న మహేశ్ కత్తిల షో నుంచి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

To Top

Send this to a friend