పవన్ ముందు ఎన్టీఆర్, మహేశ్ దిగదుడుపే..

మహేశ్ బాబు-మురగదాస్ కలిసి తీస్తున్న స్పైడర్ సినిమాకు ఈ ఊపు లేదు. ఇటీవల టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ సినిమాను వారు పట్టించుకోవడంలేదు. కానీ పవర్ స్టార్ పవన్ సినిమాను మాత్రం ఎగబడి కొంటున్నారు. పవన్ మేనియా తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందో ఈ ఒక్క సంఘటన మనకు తేటతెల్లం చేస్తోంది.

మహేశ్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. దీనికి తెలుగులో ఇంతవరకు ఓపెనింగ్సే లేవట.. ఏ నిర్మాత ఈ సినిమాను కొంటామని ఆఫర్ చేయలేదట.. రిలీజ్ డేట్ కన్ఫమ్ కాకపోవడంతో మహేశ్ సినిమాపై స్తబ్ధత నెలకొంది. ఇక ఎన్టీఆర్ జైలవకుశ టీజర్ విడుదలైనా కూడా ఆ సినిమా 30 కోట్లకు మించి బిజినెస్ ఇప్పటివరకు జరగలేదట..

కానీ వరుసగా సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి ప్లాపులిచ్చినా కూడా పవన్ రాబోయే సినిమాను అత్యధిక రేట్లు పెట్టి కొనడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారంటే ఆయన క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో పవన్. అలాంటి పవన్ సినిమా విడుదలైనా ప్లాప్ అయినా కూడా నిర్మాతకు నష్టం రాదు. పవన్ పై ఉన్న అభిమానంతో సినిమాను ఆదరిస్తుంటారు ప్రేక్షకులు.. దీంతో నిర్మాత పెట్టిన మొత్తం తిరిగివచ్చేస్తుంది. అదే ఆలోచనతో ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ ల సినిమాను భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతున్నట్టు సమాచారం.

మహేశ్ స్పైడర్, ఎన్టీఆర్ జైలవకుశల కంటే కూడా ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాను కోట్లు పెట్టి కొనడానికి నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. క్రేయేటివ్ జీనియస్, ప్లాపులు ఎరుగని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండడం.. పవన్ యూత్ ఫుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్లకు పవన్ లేటెస్ట్ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్ ఆఫర్ చేసినట్టు తెలిసింది. దీంతో పవన్ మేనియా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

To Top

Send this to a friend