మహేశ్ సినిమా వాయిదా..


మహేశ్ బాబు సినిమా మరోసారి వాయిదా పడింది. తాజా షెడ్యూల్ లో జాప్యం కారణంగా జూన్ 23 ను రావాల్సిన సినిమా మరింత వాయిదా పడనున్నట్టు తెలిసింది. తాజాగా ఈ షెడ్యూల్ ఈనెల 20 నుంచి మే 10 వరకు కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది.

షూటింగ్ గ్యాప్ వల్ల సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే చాన్సుందని నిర్మాతలు భావిస్తారు. జూలై 7న లేదా ఆగస్టు 11న రిలీజ్ అయ్యే సూచనలున్నాయని తెలుస్తోంది. సినిమాను ఇక ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మహేశ్ సినిమా శ్రీమంతుడు ఆగస్టులోనే రిలీజ్ భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు కొత్త సినిమా స్పైడర్ కూడా ఆగస్టులోనే రిలీజ్ కానుంది.

స్పైడర్ మూవీలో మహేశ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఏజెంట్ రాలో పనిచేస్తున్న ఐపీఎస్ పాత్రలో ఆయన అదరగొట్టారని సమాచారం. మురగదాసు దర్శకత్వం కావడంతో పక్కా కథ ప్రధాన చిత్రమనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులు, ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది.

To Top

Send this to a friend