మామ-భర్త.. సేమ్ టు సేమ్..

నమ్రత తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఆ ఫొటోతో మహేశ్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచే నమ్రత నిన్న తన మామ కృష్ణ తొలినాళ్లలోని ఫొటోను.. అచ్చం అలానే ఫోజు ఇచ్చిన తన భర్త మహేశ్ ఫొటోను పక్కపక్కన పెట్టి షేర్ చేసింది. ‘అప్పుడు మా లెజండరీ మామ గారు.. ఇప్పుడు అదే డ్రెస్ లో ఆయన అందమైన కుమారుడు’ అంటూ క్యాఫ్షన్ కూడా ఇచ్చింది. ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరు ఒకే స్టైల్లో ఉండడం.. ఆ ఫొటో వైరల్ కావడంతో మహేశ్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు ఆయన పేరును ఎక్కడ వాడకుండా స్వయంకృషితో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కి ప్రస్తుతం టాలీవుడ్ అందగాడుగా పేరొందాడు. మహేశ్ ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ నమ్రత ప్రస్తుతం మహేశ్ పనులన్నింటిని చక్కదిద్దుతోంది. మహేశ్ ప్రతి యాక్టివిటీని అభిమానులతో పంచుకుంటూ ఇలా సందడి చేస్తోంది.

To Top

Send this to a friend