పవన్, ప్రభాస్ ను మించి మహేశ్ కు స్థానం..

టైమ్స్ గ్రూప్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ పోల్ లో ప్రథమ స్థానాన్ని బాలీవుడ్ నటుడు రోహిత్ ఖండెల్వాల్ దక్కించుకున్నాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు 7వ స్థానంలో నిలిచారు. ఇక ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాన్ టాప్ 10లో కూడా లేకపోవడం గమనార్హం..

దేశంలో మంచి శరీర సౌష్టవం, లుక్, అందం ఉన్న హీరోలను , అభిమానుల మదిలో గూడుకట్టుకునే హీరోలకు ఇందులో చోటు ఉంటుంది. అందులో భాగంగా పోటీకి ఎంపిక చేస్తారు. ఇలా మిస్టర్ వరల్డ్ -2016 పోటీల్లో మోస్ట్ డిజైరబుల్ మెన్ పోల్ లో మహేశ్ బాబు వరుసగా రెండో ఏడాది చోటుదక్కించుకున్నాడు. గత ఏడాది దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలవగా.. ఈసారి ఒక స్థానం దిగజారి 7వ స్థానంలో నిలిచారు.

దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగులో కూడా ఈ పోటీ ఫలితాలు విడుదల చేశారు. తెలుగులో మహేశ్ తొలిస్థానంలో నాని రెండో స్థానంలో నిలిచారు. నాని నేచురల్ స్టార్, సహజనటనతో ఈ కిరిటం కొట్టేశారు. బాహుబలితో ప్రభంజనం నెరిపిన రానా 4 వస్థానంలో, 5 వస్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. ప్రభాస్ 6వ స్థానంలో ఉన్నారు. పవన్ కల్యాన్ 11 వస్థానంలో నిలవడం గమనార్హం..

To Top

Send this to a friend