మహేష్ బాబు వాడుకోవడంలో ఫెయిల్..

బయో వార్ .. ఇప్పటివరకు దేశంలో ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్. మురగదాస్ ఎంచుకునే కథలే చాలా ప్రత్యేకం.. 7th సెన్స్ మూవీలో కూడా చైనాలో కరాటే విద్యను నేర్పిన దక్షిణ భారతీయుడు భోది ధర్మ విశేషాలను సినిమా గా తీసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. మహేష్ తో కూడా రోబోటిక్ బయో వార్ ను కథాంశంగా ఎంచుకున్నారు. ఇలాంటి మంచి కథ కథనంతో సినిమా చేస్తున్న మురగదాస్ సినిమా ప్రమోషన్ లో మాత్రం ఘోరం ఫెయిలయ్యాడని మహేష్  అభిమానులు మథన పడుతున్నారు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సినిమా అంటే తెలుగుతో పాటు ఇతర మార్కెట్లో కూడా సందడి కనిపిస్తుంది. కానీ మహేష్ తీస్తున్న స్పైడర్ సినిమాకు సంబంధించిన టీజర్ తప్ప ఇంకేవీ మురగదాస్ విడుదల చేయలేదు. ఇంతమునుపు మురగదాస్ తమిళంలో తీసిన కత్తి, తుపాకీ వంటి సినిమాలకు విపరీతమైన ప్రచారం కల్పించారు. సినిమా పోస్టర్లు, స్టిల్స్ విడుదల చేసి హైప్ సృష్టించాడు. కానీ స్పైడర్ కు సంబంధించిన ఏ ఒక్క పోస్టర్, విశేషాలు అభిమానులకు విడుదలకాకపోవడంపై వారంతా గుర్రుగా ఉన్నారు. కనీసం స్పైడర్ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు.

తమిళ అగ్రదర్శకుడు మురగదాస్ మాత్రం మహేష్ సినిమాను లైట్ తీసుకుంటున్నాడని మహేష్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. స్పైడర్ సినిమాను మొదట జూన్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆలస్యం పేరుతో దసరాకు అంటున్నారు. అప్పుడు కూడా డేట్ ప్రకటించలేదు. దీంతో సినిమా డిసెంబర్ కు వెళ్లిపోతుందా అనే భయం నెలకొంది. మురగదాస్ మహేష్ సినిమా విషయంలో మరీ ఆలస్యం చేయడంపై ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానుల్లో కూడా నిరాశ వ్యక్తం అవుతోంది.

To Top

Send this to a friend