మహేశ్ బాబు ఏంటిది..?

వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాతలుగా మహేశ్ బాబు హీరోగా అన్నపూర్ణ స్టూడియోలో సినిమా పూజాకార్యక్రమాలు చేసుకుంది. కార్యక్రమానికి మహేశ్ బాబు హాజరుకాలేదు. ఎందుకంటే పూజా కార్యక్రమాలకు హాజరైతే సినిమా ప్లాప్ అవుతుందని మహేశ్ నమ్మకం. అందుకే ఆయన స్థానంలో మహేశ్ భార్య నమ్రత, కుమారుడు, కూతురు వచ్చారు.

మహేశ్ బాబు స్పీడందుకున్నారు. ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తవకముందే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటించేస్తున్నారు. అటు స్పైడర్ సినిమా ప్రమోషన్ తో పాటు ఇటు కొరటాల డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ లో బిజీగా మారారు. ఇప్పుడా సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. మరో సినిమాకు ఓకే చెప్పి ఫుల్ ఫాస్ట్ గా ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నారు.

ఈ సినిమా మహేశ్ బాబు 25వ సినిమా కావడం విశేషం. సినిమాకు హీరోయిన్ గా కొందరు బాలీవుడ్ హీరోయిన్లను అడిగినా డేట్స్ అడ్జట్స్ కాలేకపోవడంతో తమిళంలో పాపులర్ అయిన హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. సినిమా కథ దృష్ట్యా ఎక్కువ భాగం అమెరికాలోనే చిత్రీకరణ చేయనున్నట్టు సమాచారం. ఇక ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ తీస్తున్న ఈ సినిమా అదీ మహేశ్ బాబు హీరోగా కావడంతో ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న మహేశ్ బాబు ఈ సినిమాలు గనుక అటు ఇటూ అయితే ఘోరమైన తప్పిదం అవుతుందని.. అందుకే మహేశ్ ఈ వరుస సినిమాలపై ఆలోచించుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

To Top

Send this to a friend