పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు కలిసి..

నితిన్ తాజా సినిమా ‘లై’ ఆడియోను ఘనంగా నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. భారీ గడ్డంతో ఓ యాక్షన్ లవ్ స్టోరీని తీస్తున్నారట.. దీనికోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టినట్టు సమాచారం. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాతలకు హీరో మహేశ్ బాబు మాంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో మహేశ్ బాబుతో కలిసి వారు ‘దూకుడు’ సినిమా తీశారు. ఆ సినిమా గ్రాండ్ హిట్ అయ్యింది. ఆ అనుబంధంతోనే ఇప్పుడు లై సినిమా ఆడియో ఫంక్షన్ కు మహేశ్ బాబును చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నారట.. దీనికి మహేశ్ బాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

స్టార్ హీరో పవన్ కళ్యాన్ ప్రతీ ఏటా తన తోటలో కాసిన మామిడిపండ్లను హీరో నితిన్ కు పంపుతుంటారు. హీరో నితిన్ కు .. పవన్ కళ్యాణ్ అంటే ఎప్పటినుంచో పిచ్చ అభిమానం.. గత ‘అఆ’ సినిమాను పవన్ చెబితేనే త్రివిక్రమ్.. నితిన్ హీరోగా తీసిన సంగతి తెలిసిందే..పవన్ -నితిన్ లు అన్నాదమ్ముళ్ల వలే ఇంటా బయటా కలిసి ఉంటారు. ఇంత అనుబంధంతోనే నితిన్ తన ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ ను ఆహ్వానిస్తుంటారు.

తన కొత్త చిత్రం లై కోసం కూడా పవన్ ను ఆహ్వానించాడట నితిన్. సో అటు నిర్మాతలు మహేశ్ బాబును, ఇటు నితిన్ పవన్ ను ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించడంతో ఇద్దరు స్టార్ హీరోలు పవన్ -మహేశ్ లు ఒకే వేదికపై కనిపించబోతున్నారు.. ఇది అభిమానులకు పండగే..

To Top

Send this to a friend