మహేశ్-మురగదాస్ మొదలెట్టేశారు..

ఇటు ప్రమోషన్ తో పాటు, అటు పాటలను, మహేశ్ స్టిల్స్ ను విడుదల చేయడానికి దర్శకుడు మురగదాస్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.. ఇప్పటికే మహేశ్ కు సంబంధించిన కొన్ని పిక్స్, చిన్న టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ బుధవారం సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘స్పైడర్’.రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ మూవీని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణకు చిత్రం యూనిట్ ఫారెన్ వెళ్లినట్టు సమాచారం. వారంలో అక్కడ పని పూర్తి చేయాలని భావిస్తోంది.

మురగదాస్-మహేశ్ బాబు కలయికలో రాబోతున్న స్పైడర్ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఈ మూవీ ప్రీ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నట్టు టాలీవుడ్ భోగట్టా..స్పైడర్ మూవీ తెలుగు తమిళంలో రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ లో మురగదాస్ కు పిచ్చ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఆ క్రేజ్ తోపాటు మహేశ్ స్టామినా కలవడంతో స్పైడర్ మూవీ అంచనాలకు అందనంతగా ప్రీరిలీజ్ బిజినెస్ జరినట్టు చైన్నై నుంచి అందుతున్న సమాచారం.

తమిళ అగ్ర హీరోలు విజయ్, అజిత్ సినిమాల బిజినెస్ లతో సమానంగా అంచనాలకు అందని విధంగా స్పైడర్ 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. తమిళనాడులో ఈ బిజినెస్ జరగడానికి టాలెంటెడ్ తమిళ దర్శకుడు మురగదాస్ స్టామినాయే కారణం.. ఈ దెబ్బకు మహేశ్ బాబు తమిళ్ లో కూడా హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.

To Top

Send this to a friend