స్పైడర్ రిలీజ్ రద్దు.. మహేశ్ సంచలన నిర్ణయం..

మహేశ్ బాబు ఇప్పటివరకు హిందీలో డైరెక్ట్ గా సినిమా చేయలేదు. ఆయన సినిమాలన్నీ హిందీలో శాటిలైట్ ద్వారానే రిలీజ్ అయ్యాయి. ఈనేపథ్యంలో హిందీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మహేశ్ తటపటాయిస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ‘స్పైడర్’ తీస్తున్న సంగతి తెలిసిందే. రోబోటిక్ వార్ నేపథ్యంలోసాగే ఈ సినిమా కథ ఇంతకుముందెన్నడూ సెల్యూలాడ్ రాలేదట.. సో ఈ సినిమాను మురగదాస్- మహేశ్ బాబులు ఇప్పటికే తెలుగు, తమిళంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ మొదట అనుకున్న హిందీలో మాత్రం ఇప్పుడే రిలీజ్ చేయడంలేదట..

మహేశ్ బాబు హిందీలో స్పైడర్ సినిమాను మొదట రిలీజ్ చేయాలని భావించాడు. కానీ సినిమా అటు ఇటూ అయ్యి ప్లాప్ అయితే ఎంట్రీ దెబ్బతింటుందని భావించి హిందీలో లేట్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడట.. ఫైనల్ కాపీ చూశాక తెలుగు, తమిళంలో వచ్చిన హిట్ టాక్ ను బట్టి హిందీలో రిలీజ్ చేద్దామా.? లేదా అన్నది నిర్ణయిద్దామని మహేశ్ భావిస్తున్నాడట..

అందుకే హిందీ రిలీజ్ ను కాస్త వాయిదా వేసినట్టు సమాచారం. హిందీలో ఎంట్రీ ఇస్తే హిట్ చిత్రంతోనే వెళ్లాలని అందుకే తెలుగు, తమిళ్ లో స్పైడర్ కు వచ్చిన స్పందన తర్వాతే హిందీలో రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend