బిగ్ బాస్ నుంచి ఏడుపుగొట్టు సెలబ్రెటీ ఔట్

బిగ్ బాస్ లో ఇక ఏడుపులుండవు.. ఎందుకంటే షో మొదలైనప్పటి నుంచి ఏడుస్తున్న సెలబ్రెటీ నిన్న ఎలిమినేట్ అయిపోయింది. ప్రేక్షకులందరూ ఏడుపుగొట్టు సెలబ్రెటీకి ఓట్లేసి ఆమెను బయటకు పంపించేశారు. దీంతో ఆ ఏడుపులకు బిగ్ బాస్ హౌస్ లో ఇక చెక్ పడింది.. బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ ఆదివారం ఎలిమినేషన్ కు బిగ్ బాస్ ముగ్గురిని నామినేట్ చేశాడు. సమీర్, ప్రిన్స్, మధుప్రియ. ఈ ముగ్గురిలో ఒక్కరు బిగ్ బాస్ ఇంట్లోంచి వైదొలగడం ఖాయం.

అయితే ప్రేక్షకుల ఓట్ల మేరకు మధుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. సమీర్, మదుప్రియలు ఇద్దరు పోటాపోటీగా నామినేషన్ చివరి రేసులో నిలిచారు. కెప్టెన్ అయిపోయిన ప్రిన్స్ ఈ నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. మిగిలిన సమీర్, మదుప్రియల్లో అందరూ మధుప్రియ ఎలిమినేట్ కావాలని ఓట్లు వేయడంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ లోంచి నిన్న హోస్ట్ ఎన్టీఆర్ బయటకు పంపించి వేశాడు.. దీంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఏడుపులకు చెల్లుచీటి పడిపోయింది. అలా ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తాను ఉండలేకపోతున్నానంటూ గాయని మధుప్రియ ఏడుస్తూనే ఉంటోంది. ఇక ఆమెకు తోడు సంపూ కూడా ఏడ్చేసి బయటకు వచ్చేసాడు.

కానీ మధుప్రియ మాత్రం రెండు వారాలుగా ఏడుపుతోనే ఇంట్లో ఉంటోంది. ఇది చూసి ప్రేక్షకులకు, బిగ్ బాస్ కు వెగటు పుట్టిందేమో కానీ ఈ శని,ఆది వారాల్లో ఎలిమినేషన్ లో మధుప్రియ ఎలిమినేట్ అయిపోయింది.

To Top

Send this to a friend