ఆధార్ చింతను కేంద్రం తీర్చేసింది..

పుడితే ఆధార్.. చస్తే ఆధార్.. కాలు బయటపెడితే ఆధార్.. భారత దేశంలో బతకడానికి తిండిలేకపోయినా ఫర్వాలేదు.. కానీ.. ఆధార్ నంబర్ మాత్రం కంపల్సరీ.. రేషన్ కు ఆధార్, రైల్వే ప్రయాణానికి ఆధార్, బతకడానికి ఆధార్, చచ్చినా ఆధారే.. అన్నింటికి మన ప్రభుత్వం ఆధార్ ను లింక్ పెట్టేసింది. దీంతో ఇప్పుడు బయటకు వెళితే ఆధార్ తీసుకుపోకుండా జనం ఉండలేకపోతున్నారు. అయితే ఇంత ఉపయోగకరమైన ఆధార్ ను మొబైల్ లోindia యాప్ రూపంలో నిక్షిప్తం చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం ఎంఆధార్ యాప్ ను విడుదల చేసింది. దాని ద్వారా అందరికీ ఈ కార్డుల గోల తప్పి ఇక మొబైల్ లోనే ఆధార్ ను యాప్ లో ఉంచుకోవచ్చు. దాని కథాకమామిషూ ఏంటో కింద చూద్దాం..

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇటీవలే ‘ఎంఆధార్ (mAadhaar)’ పేరిట ఆధార్ యాప్‌ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై లభిస్తున్నది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఎంఆధార్ యాప్ ద్వారా యూజర్లు తమ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు ఆధార్, మొబైల్ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేసి ఓటీపీ కన్‌ఫాం చేస్తే చాలు, ఆధార్ వెంటనే ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఆధార్‌కు అనుసంధానం అయి ఉన్న ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

1. maadhaar యాప్‌ను ఓపెన్ చేయగానే మొదట యాప్‌కు ఓ పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. 8 నుంచి 12 క్యారెక్టర్లు వచ్చే విధంగా యూజర్లు పాస్‌వర్డ్ సెట్ చేసుకుని ముందుకు సాగాలి.
2. అనంతరం వచ్చే సెక్షన్‌లో యూజర్లు తమ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. లేదంటే ఆధార్ క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేసి ముందుకు సాగవచ్చు.
3. తరువాత వచ్చే విభాగంలో ఓటీపీ కన్‌ఫర్మేషన్ అడుగుతుంది. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌ను అందులో ఎంటర్ చేయాలి.
4.అనంతరం వచ్చే సెక్షన్‌లో ముందు క్రియేట్ చేసుకున్న యాప్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి.
5. ఆపైన వ‌చ్చే విభాగంలో ఆధార్ కార్డు డిస్‌ప్లే అవుతుంది. దానిపై క్లిక్ చేసి మ‌ళ్లీ యాప్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి.
6. అనంత‌రం మీ ఆధార్ కార్డు తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దాన్ని ట‌చ్ చేస్తే ఆధార్ కార్డు రెండో వైపు కూడా క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలో ఫోన్ తెరను స్క్రీన్ షాట్ తీయ‌డం ద్వారా మీ ఆధార్ కార్డును ఫోన్‌లోకి ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకోవ‌చ్చు.

ఎం ఆధార్ యాప్ లింక్ ఇదిగో:

click here

గూగుల్ ప్లే స్టోర్‌లో maadhaar అని టైప్ చేసి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే మీరు వాడే ఫోన్‌లో క‌నీసం ఆండ్రాయిడ్ 5.0 ఓఎస్ ఉండాలి.

To Top

Send this to a friend