ఎన్టీఆర్ తో మాటీవీ సాహసం చేస్తోంది..


మాటీవీ పగ్గాలు స్టార్ టీవీ యాజమాన్యం చేపట్టాక కొత్త పుంతలు తొక్కుతోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో చిరంజీవికి కోట్లు కుమ్మరించి వ్యాఖ్యాతగా పెట్టారు. ఇప్పుడు ఏకంగా అంతకు రెట్టింపు పారితోషికాన్ని ఎన్టీఆర్ కు ఇచ్చి బిగ్ బాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం సంచలనంగా మారింది.. ఒక ప్రాంతీయ భాషలో రూ. 45 కోట్లు ఒక షోకు ఖర్చుపెడుతూ మాటీవీ సాహసం చేస్తుందనే చెప్పాలి. ప్రోగ్రాం ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతుంది. సెలబ్రెటీలంతా.. కొద్దిరోజులు ఒక ఇంట్లో సెల్ ఫోన్, టీవీ, ఎలాంటి ప్రసార మాద్యమాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకుండా కలిసి జీవించాలి. ఇందులో ఎవరెవరు ఎలాంటి హావభావాలు ప్రదర్శిస్తారనే దాన్ని వీడియోల్లో రికార్డు చేసి షోగా ప్రసారం చేస్తారు.

ఇదే బిగ్ బాస్ ప్రోగ్రాంను సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా నడిచిన ఈ ప్రోగ్రాం అక్కడ బాగా హిట్ అయ్యింది. దాన్నే తెలుగులోనూ స్టార్ గ్రూపు తీసుకొస్తోంది. స్టార్ మాటీవీ భారీ పెట్టుబడి పెడుతూ రెడీ చేస్తోంది. వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ ను పెట్టారు. ఇందుకోసం భారీ మొత్తమే ముట్టజెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ప్లాప్ కావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ నిర్వహించే బిగ్ బాస్ ప్రోగ్రాంపైనే మాటీవీ కోటి ఆశలు పెట్టుకుంది. ఎన్టీఆర్ లోని నటన, సమయస్ఫూర్తి, చలాకీతనం,, దూకుడు వల్ల బిగ్ బాస్ కార్యక్రమం హిట్ అవుతుందని మాటీవీ భావిస్తోంది.. ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం కోసం యాజమాన్యం రూ45 కోట్ల బడ్జెట్ కేటాయించడం సంచలనంగా మారింది..

To Top

Send this to a friend