ఇక‌పై `మా` త‌క్ష‌ణ స‌హాయం 2ల‌క్ష‌లు!

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సంఘం) మెంబ‌ర్ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల శివాజీ రాజా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన నూత‌న కార్య‌వ‌ర్గం `మా` అభివృద్ధిలో భాగంగా కొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది.

`మా` టీమ్ లో ఆర్ధికంగా వెనుక‌బ‌డిన వారు చ‌నిపోయిన‌ప్పుడు ద‌హ‌న సంస్కార కార్య‌క్ర‌మాలు నిమిత్తం కొంత అమౌంట్ ను అప్ప‌టిక‌ప్పుడు ఉరు కులు..ప‌రుగులు మీద అందించ‌డం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తికి స్వ‌స్థి ప‌లుకుతు కొత్త ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టారు. మా టీమ్ లో మెంబ‌ర్ పేరిట ఉన్న డెత్ ఇన్స్ రెన్స్ క్లైమ్ క్రింద త‌క్ష‌ణం 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చ‌నిపోయిన రోజునే అందించ‌డం జ‌రుగుతుంద‌ని `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, ` `మా`తో 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఇన్నేళ్ల అనుభ‌వంలో ఎన్నో విష‌యాల‌ను తెలుసుకున్నాను. మా మెంబ‌ర్ల‌లో ఎవ‌రైనా పేద క‌ళా కారులు చ‌నిపోయిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో ద‌హ‌న సంస్కార కార్య‌క్ర‌మాలు సైతం పూర్తి చేయ‌లేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి స‌మ‌యంలో `మా` నుంచి 5000, 10000 రూపాయ‌ల ఆర్ధిక స‌హాయం అందేది. అయితే ఇక‌పై అలా కాకుండా త‌క్ష‌ణ ప‌రిష్కారంగా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వెంట‌నే అందించ‌డం జ‌రుగుతుంది. త‌ర్వాత మెంబ‌ర్ పేరిట ఉన్న 2 ల‌క్ష‌ల ఇన్సురెన్స్ క్లైమ్ ను `మా` లో జ‌మ చేసుకుంటాం` అని తెలిపారు.

కొత్త‌గా ఏర్పాటైన `మా` టీమ్ ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని `మా` మాజీ అధ్య‌క్షులు ముర‌ళీ మోహ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

To Top

Send this to a friend