లోకేష్ భాషా పటిమ…

ఓ కేసీఆర్.. ఓ మోడీ దేశంలోనే మంచి వక్తలు.. వీరిద్దరితో సరితూగే మాటల మాంత్రికులు ప్రస్తుతానికి దేశంలోనే లేరు.. దక్షిణాదిన మూడు సార్లు సీఎంగా ఎన్నికైన చంద్రబాబు కూడా బాగా మాట్లాడడంలో తడబడుతూనే ఉన్నారు. ఇక ఆయన కొడుకు లోకేష్ మాత్రం తండ్రిని మించి ఎలా ఎదుగుతాడు.. అసలే ఇంగ్లీష్ మీడియం చదువులాయే.. ఇంగ్లీష్-తెలుగు కలగలిపి మాట్లాడుతున్న లోకేష్ బాబు ప్రసంగాలకు జనం చప్పట్లు పడడం లేదు.

అదే పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మాత్రం జనం నాడి పట్టేశాడు. తండ్రి బాటలో మాటల తూటాలు పేల్చడం రాటుదేలుతున్నాడు. ఎంతైనా కేసీఆర్ పుత్రరత్నం కదా.. ఆయనలోని గుణాలు కేటీఆర్ లోనూ వచ్చాయి. కేసీఆర్ కూతురు కవిత కూడా నాన్నలా ప్రసంగాల్లో అదరగొడుతూనే ఉన్నారు. మంచి వక్తలుగా కేటీఆర్, కవితలు నాన్న బాటలో నడిచారు..

కానీ మన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎంతైనా చంద్రబాబే నయమనిపిస్తోంది. ‘తెలియజేసుకుంటున్నాను’ అనే ఊతపదంతో రిపీట్ చేసే చంద్రబాబు సమయం, సందర్భానుసారం.. జనానికి అర్థమైనా.. కాకున్నా స్పష్టంగానే మాట్లాడుతున్నాడు. కానీ మన లోకేష్ బాబు మాత్రం ఏదీ ఆలోచించకుండా.. ఏ కార్యక్రమానికి వచ్చామో తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నారు.

మొన్నటికి మొన్న లోకేష్ మాటలకు సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. పప్పూ లోకేష్ అంటూ ఆడిపోసుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి రోజున ‘వర్థంతి శుభాకాంక్షలు’అంటూ నోరుజారి లోకేష్ నవ్వుల పాలయ్యారు. మంగళవారం పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా  తూ.గో జిల్లా కరపలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ .. ‘ప్రతి పల్లెటూరుకు తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని’ అనడంతో జనం ఘొల్లుమన్నారు. తాగునీరు లేని గ్రామాలు ఏర్పాటు చేస్తావా అని లోకేష్ నవ్వుకున్నారు. అదేసమయంలో విషయం గ్రహించిన లోకేష్ .. ‘ఇబ్బంది కాదు కాదు’ అంటూ తడబడ్డారు. ఇలా లోకేష్ లో భాష పటిమకు నవ్వుల పాలవుతున్నారు.

To Top

Send this to a friend