తెలుగు నిర్మాతకు జీవిత ఖైదు

చట్టం ముందు అందరు సమానులే అంటారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాలి. అయితే కాస్త ఆలస్యం అవుతుందేమో అంతే. తాజాగా ఒక తెలుగు సినీ నిర్మాత చేసిన తప్పుకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం జరిగింది. ఆ నిర్మాత మరెవ్వరో కాదు చెంగల వెంకట్రావు. బాలకృష్ణతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ సమరసింహారెడ్డి చిత్రాన్ని, ఎన్టీఆర్‌తో అట్టర్‌ ఫ్లాప్‌ చిత్రం ‘నరసింహుడు’ చిత్రాన్ని నిర్మించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న చెంగల వెంకట్రావు.

నందమూరి బాలకృష్ణ సహాయ సాకారాల వల్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన చెంగల హత్య కేసులో చాలా కాలం నిందితుడు. ఆ హత్య కేసు విచారణ సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. కోర్టు ఆ హత్య కేసులో చెంగలకు సంబంధం ఉందని నిర్థారణకు వచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా సుపరిచితుడు అయిన చెంగలకు జైు శిక్ష పడటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఎన్టీఆర్‌ నటించిన నరసింహుడు సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఈయన చిక్కుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్లు మరియు ఫైనాన్సియర్లు ఒత్తిడి చేయడంతో హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఈ సంఘటన సంచలనం అయ్యింది. అప్పటి నుండి చెంగల అంతగా మీడియా ముందుకు రాలేదు. మళ్లీ ఇప్పుడు కేసు విషయంలో శిక్ష పడటంతో మీడియా ముందుకు వచ్చాడు.

To Top

Send this to a friend