లై’ టీజర్‌ రివ్యూ

నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లై’. ఇప్పటి వరకు ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రాలను తెరకెక్కించిన హను ఈ చిత్రంతో జోనర్‌ మారాడు. క్లాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న నితిన్‌ ఈ చిత్రంతో మాస్‌ ఆడియన్స్‌ను అలరించబోతున్నట్లుగా టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆసక్తిని కలిగిస్తున్న టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌లో భారీతనం క్లీయర్‌గా కనిపిస్తుంది. అలాగే నితిన్‌ లుక్‌ మరియు స్టైల్‌ పూర్తిగా మారిపోయింది.

నితిన్‌కు సరి సమానంగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పాత్ర ఉంటుందని అనిపిస్తుంది. అర్జున్‌ పాత్ర సినిమాకే హైలైట్‌ అవుతుందనే నమ్మకం టీజర్‌ను చూసిన తర్వాత అర్థం అనిపిస్తుంది. ‘కోట్ల మంది సరిపోలేదట, పంచ పాండవులు సాధించలేదట, చివరికి కృష్ణుడు ఒంటరి కాదట, అబద్దం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం కూడా పూర్తి కాదట, అశ్వధామ హతహా.. కుంజరహా’ అంటూ ఉన్న డైలాగ్‌ సినిమా స్థాయిని పెంచే మాదిరిగా ఉంది.

‘అఆ’ చిత్రంతో స్టార్‌ హీరో జాబితాలో చేరిపోయిన నితిన్‌ ఈ సినిమాతో తన స్థాయిని మరింతగా పెంచుకోబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రంలోని నితిన్‌ లుక్‌ మరియు యాక్షన్‌ సన్నివేశాల్లో నితిన్‌ కనబర్చిన నటనతో ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయని టీజర్‌తో తేలిపోయింది. టీజర్‌ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటున్నాయి. వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

To Top

Send this to a friend