ట్విస్టులతో ఉత్కంఠ రేపిన ‘లై’

క్షణ క్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి ఇలా హనురాఘవపూడి దర్శకత్వంలో నితిన్, మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘లై’ చిత్రం ట్విస్టులతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది.. ఇప్పటికే ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ వంటి ప్రేమ కథా చిత్రాలను అందించిన హనురాఘవపూడి అదే ప్రేమ కాన్సెప్ట్ తో కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించిన ‘లై’ ప్రేక్షకులను ఎంత మేరకు అలరించిందో తెలుసుకుందాం..

* కథ ఏంటంటే..
సీనియర్ హీరో అర్జున్ ఈ సినిమాలో సీక్రెట్ మాఫియా డాన్ గా నటించారు. రవికిషన్ అర్జున్ కింద లోకల్ డాన్ గా పనిచేస్తుంటాడు. ఇక హీరో నితిన్ కి హీరోయిన్ మేఘా ఆకాష్ తో ఓ అబద్ధం కారణంగా పరిచయం ఏర్పడుతుంది. ఆ అబద్ధాలతోనే ఆమెని ప్రేమలో పడేస్తాడు నితిన్. అలా నడుస్తున్న వారి ప్రేమ కథ ఫస్ట్ ఆఫ్ ముగిసే ఇంటర్వెల్ లో కొత్త మలుపు తిరుగుతుంది. నితిన్ కు ఒక బ్యాగ్ దొరకుతుంది. ఆ బ్యాగ్ తనకి తెచ్చి ఇవ్వాలని విలన్ కం స్టార్ హీరో అర్జున్ .. నితిన్ ని ఆదేశిస్తాడు. అసలు ఆ బ్యాగ్ లో ఏముంది.. నితిన్ కి, విలన్ అర్జున్ కి మధ్య వైరం ఎందుకొచ్చింది.. చివరికి నితిన్, మేఘా ఆకాష్ ల ప్రేమ ఏమైంది అనేదే ‘లై’ కథాంశం.

* సినిమా లో ట్విస్ట్ లు ఇవీ..
ఇంటర్వెల్ లో ప్రేక్షకులు ఊహించని అద్భుతమైన ట్విస్ట్ తో సినిమా మరింత ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శకుడు హను సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సెకండాఫ్ లో కథ మొత్తం మారిపోతుంది.
టామ్ జెర్రీ సిరిస్ లో పిల్లి ఎలుక సమరంలా లై సినిమా సాగుతుంది. లై సినిమాలో హీరో నితిన్, విలన్ అర్జున్ ల మధ్య జరిగే పోరాటాలు ఆసక్తి రేపుతాయి. రెగ్యులర్ కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండవు. ఫస్ట్ ఆఫ్ ని ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు ముందుకు సాగించాడు. అర్జున్ , నితిన్ ల మధ్య వచ్చే ట్విస్ట్ లతో ఎప్పటికప్పుడు స్టోరీలో కొత్తదనం కనిపించేలా చేయడంలో దర్శకుడు విజయమంతమయ్యాడు. ముఖ్యంగా నితిన్, అర్జున్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో హీరోగా నితిన్ బాగా చేసినప్పటికీ సీనియర్ హీరో అర్జున్ నటనే హైలెట్ అని చెప్పాలి. ఒక విచిత్రమైన మనస్తత్వం గల విలన్ గా అర్జున్ జీవించేశాడు. హీరోయిన్ గా మేఘా ఆకట్టుకుంది.

* సినిమా ఎలాగుందంటే..
లై సినిమాను రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యస్ తో తీయడంలో దర్శకుడు నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా విదేశాల్లోని లోకేషన్స్ బాగా కనిపిస్తాయి. సినిమాను నడిపించిన తీరుకు దర్శకుడు హనురాఘవపూడిని మెచ్చుకోవాల్సిందే..అద్భుతమైన టేకింగ్ తో సినిమాలో ట్విస్ట్ లు అలరిస్తాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత కూడా మణిశర్మ సంగీతం అకట్టుకుంది. ఇక ప్లాప్ విషయానికి వస్తే ఈ సినిమాలో అందరికీ కావలసిన కమర్షియల్ హంగులు లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. మొత్తానికి నితిన్ అందమైన ప్రేమకథతో కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథతో డిఫెరెంట్ గా మూవీని తీశాడు. లై సినిమా కొత్తదనం కోరుకునే వారికి కచ్చితంగా నడుస్తుంది. రెగ్యులర్ మసాలా తెలుగు సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా..

To Top

Send this to a friend