జేసీకి తగిన శాస్తి.. ఇక ఎగరలేడు..


అధికారం ఉంటే అన్నీ అయిపోతాయని విర్రవీగితే ఏమవుతుందో మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీకి ఇప్పటికే బాగా అర్థమైంది. ఎయిర్ ఇండియా ఉద్యోగిని విమానంలో కొట్టిన శివసేన ఎంపీ గైక్వైడ్ పై దేశంలోని విమానయాన సంస్థలన్నీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత గైక్వైడ్ కాళ్లబేరానికి రావడంతో ఆ వివాదం సమసిపోయింది. ఆ సంగతి మరిచిపోకముందే మరో ఎంపీ అలానే చేశారు.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ నుంచి హైదరాబాద్ కు వెళ్లే ఇండిగో విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఎంపీ వ్యక్తిగత సిబ్బంది కౌంటర్ వద్దకు వెళ్లి బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కోరగా నిబంధనల ప్రకారం 45 నిమిషాల ముందు వస్తేనే ఇస్తామని.. ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని చెప్పారు. దీంతో ఎంపీ జేసీ నేరుగా వెళ్లి సిబ్బందిని కొట్టాడు. ప్రింటర్ ను తోసేశాడు. ఆ తర్వాత విమనాశ్రయ డైరెక్టర్ వచ్చి జేసీకి పాస్ ఇప్పించి పంపించారు.

జేసీ ఉద్యోగులపై దాడిచేయడం.. దురుసుగా ప్రవర్తించడం దుమారం రేగింది. దీనికి నిరసనగా జేసీపై నాలుగు విమనయాన సంస్థలు నిషేధం విధించాయి. తమ సంస్థల విమానాల్లో జేసీని ప్రయాణించకుండా ఆంక్షలు పెట్టాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్, ఇండిగో సంస్థలు ఈ బ్యాన్ ను అమలు చేస్తున్నట్టు తెలిపాయి. దీంతో జేసీ ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీకి ఎటు వెళ్లాలన్నా విమానంలో వెళ్లడం సాధ్యం కాదు. రైళ్లో వెళ్లాల్సిందే.. దురుసుగా ప్రవర్తించినందుకు ఎంపీకి తగిన శాస్తి జరిగింది.

To Top

Send this to a friend