లారెన్స్ ఏమేం తీసుకున్నాడో తెలుసా!!!


‘ఓ రోజు అనుకోకుండా లారెన్స్ కు చిరంజీవి నుంచి ఫోన్ వచ్చిందట.. ‘ఏంట్రా బాగున్నావా.. నేను చిరంజీవిని మాట్లాడుతున్నా.. నాకు ఓ హెల్ప్ చేస్తావా.. ’ అని చిరు లారెన్స్ ను అడిగాడు.. ‘నేను హెల్ప్ చేయడమేంటన్నయ్యా.. చెప్పండి.. ఏం చెయ్యమంటారు.?’ అనడిగా.. ‘సార్ బిజీగా లేకపోతే ఖైదీ సినిమా కోసం ఓ సాంగ్ చేసి పెడతావా’ అని నవ్వుతూ అడిగారట.. చిరు ఫోన్ ముగియగానే హైదరాబాద్ లో వాలిపోయాను.. ‘రత్తాలు.. రత్తాలు’ పాట కోసం ఆయనతో సూపర్ స్టెప్స్ వేయించాలని అనుకోలేదు.. ఆయన ఏజ్ కు సూటయ్యే.. చిరంజీవి ఇబ్బంది పడని.. ఆయనకు బ్యాక్ పెయిన్ రాని మామూలు స్టెప్పులే వేయించాను. పాటలో సూపర్ స్టెప్స్ వేయించాలని.. పేరు సంపాదించుకోవడం కన్నా.. నాకు చిరంజీవి ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం అని అన్నారు లారెన్స్..

చిరంజీవి 150 వ సినిమాలో రత్తాలు పాట చేసినందుకు లారెన్స్ ఏలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట.. చిరంజీవి సతీమణి సురేఖ పొద్దున్నే టిఫిన్ లో చిరుకు, లారెన్స్ కు దోశ, లంచ్ లో లారెన్స్ కోసం చికెన్ ను వడ్డించిందట.. తనకు రెమ్యూనరేషన్ వద్దని.. దోశలు మాత్రమే కావాలని లారెన్స్ అడగడంతో సురేఖ, చిరంజీవి అవే పెట్టి లారెన్స్ తో ఆ ఐదు రోజుల్లో పాట పూర్తి చేయించారట.. అదీ చిరు-లారెన్స్ మధ్య ఉన్న అనుబంధం..

To Top

Send this to a friend