ఇక రాష్ట్రంలో భూసేకరణ సాధ్యమేనా ..

భూమి లేకుండా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అసాధ్యం.
ఐతే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి భూముల విషయంలో రైతులకు చేస్తున్న అన్యాయం వల్ల బహుశా రాష్ట్రంలో ప్రభుత్వానికి భూసేకరణ అసాధ్యం కావచ్చును.
స్వాతంత్ర్యము వచ్చిన తరువాత వచ్చిన పలు సాగునీటి ప్రాజెక్టులు, విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ లాంటి పరిశ్రమలు,నౌకాశ్రయం, విమానాశ్రయం, రహదారులు భూసేకరణ లేకపోతే అసాధ్యం అయ్యేవి.శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల విషయంలో భూముల సేకరణ జరిగిన 40 సంవత్సరాల తర్వాత కూడా భూమిని ఇచ్చిన రైతులకు న్యాయం జరుగలేదంటే ఇంతకన్నా అన్యాయం ఏముంది ?

2013 లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం భూయజమానులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు 3 రెట్లు ధర చెల్లింపు,భూ యజమానులకు పునరావాసం వంటి రక్షణ కల్పిస్తున్నది.అలాగే గ్రామ సభలు పెట్టి 80%భూముల యజమానులు ఒప్పుకుంటేనే భూసేకరణ జరగాలి అనే నిబంధన విధించారు.

రాజధాని అమరావతి రైతులు ఆందోళనలు చల్లార్చడానికి వైసీపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం,ఆ రైతులకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుండడం తో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నారు.ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇంటి స్థలాల కేటాయింపు,పేదల గృహ నిర్మాణము వంటి పథకాలకు ఇబ్బందులు ఎదురౌతాయి అని ఆందోళన చెందుతున్నారు.

🔯ప్రభుత్వం యస్సీ,యెస్. టీ లకు కేటాయించిన అసైన్డ్ భూముల ను సేకరించడానికి నిర్ణయించి గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తుంటే ప్రజలనుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది.
అందుకే లాండ్ పూలింగ్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం పూనుకుంది.

🔯దీనికి మరొక కారణం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలు విశాఖపట్నం పరిసరాల్లో అసైన్డ్ భూములు యెస్ సీ,యెస్ టీ రైతుల వద్ద చవకగా కోనుగోలు చేశారని వారికి మేలు చేయడానికి లాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం వారికి మేలు చేయాలని చూస్తున్నదని ఆరోపణలున్నాయి.

🔯అసైన్డ్ భూముల విషయంలో ఎకరానికి 900 గజాల భూమి ఇస్తామని చెప్పినా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రైతులు ఒప్పుకోవట్లేదు.ఆ భూమిని సాగు చేసుకొని బ్రతికే బీద రైతుల,రైతు కూలీలు మా పరిస్థితి ఏమిటి ? మాకు అమరావతి రైతుల కు ఇచ్చినట్లు 15 ఏళ్ల పాటు కౌలు, రైతు కూలీలకు నెల నెలా ₹ 5,000 పెన్షన్ ఇస్తారా ? అనే ప్రశ్నలు వేస్తున్నారు.

🔯అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం గుర్తుచేస్తున్నారు.

🔯రాజధాని అమరావతి లో జరిగిన 33,000 ఎకరాల లాండ్ పూలింగ్ గొప్పదనం,రైతుల త్యాగం వైసీపీ ప్రభుత్వానికి తెలిసివస్తున్నది.

🔯వైసీపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కనుక భూసేకరణ చేయలేదు.
🔯వైసీపీ ప్రభుత్వం పై రైతులకు నమ్మకం లేదు కనుక లాండ్ పూలింగ్ చేయలేదు.

విశ్లేషణ :
జెట్టి. శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend