వర్మకు లక్ష్మీ పార్వతి సలహా


వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ త్వరలోనే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా చేశాడు. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానంను ఒక పాట ద్వారా వర్మ వెళ్లడి చేశాడు. వర్మ గతంలో పలు బయోపిక్‌లు తెరకెక్కించాడు. ఆ బయోపిక్‌లు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా ఈ బయోపిక్‌ కూడా వివాదం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ జీవితంలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి.

వివాదాలకు పెట్టింది పేరు అయిన వర్మ ఖచ్చితంగా ఎన్టీఆర్‌ జీవితంలోని వివాదాస్పద అంశాలను డీల్‌ చేస్తాడు. అందుకే వర్మ ఆ ప్రాజెక్ట్‌ను ప్రకటించగానే అంతా కూడా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్టీఆర్‌ భార్య లక్ష్మి పార్వతి తాజాగా స్పందిస్తూ ఆయన జీవిత చరిత్రతో సినిమా తీస్తానని వర్మ ప్రకటించడం సంతోషంగా ఉందని, అయితే ఉన్నది ఉన్నట్లుగా ఆయన చూపించాలని తాను కోరుకుంటున్నట్లుగా ఆమె పేర్కొంది. ప్రలోభాలకు, బెదిరింపుల కారణంగా సినిమా కథను మార్చాలని భావిస్తే, ఎన్టీఆర్‌కు సంబంధించి అసత్యాలు చెబితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తానంటూ ప్రకటించింది.

వర్మ ఏ సినిమాను ప్రకటించినా వారి జీవిత చరిత్ర తెలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులను కలవడం ఆనవాయితీగా వస్తుంది. అంటే త్వరలోనే లక్ష్మి పార్వతిని వర్మ కలుసుకుంటాడేమో చూడాలి. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను వర్మ రెండు పార్ట్‌లుగా తెరకెక్కించే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. అయితే ఒక్క పార్ట్‌తోనా లేక రెండు పార్ట్‌లా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

To Top

Send this to a friend