సర్వే కాదది, కోట్ల రూపాయల బెట్టింగ్ స్కామ్..

ఎంపీ పదవి పోయాక ఆర్ధికంగా లగడపాటి కుదేలైనారని వార్తలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్తు వచ్చాక ఆయన విద్యుత్తు కొనే నాధుడే కరువైనాడు. టీయారెస్ ప్రభుత్వంతో విద్యుత్తు అమ్మకాల ఒప్పందం కుంభకోణం గురించి గతంలో రేవంత్ రెడ్ఠి ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు.

సేఫ్ గేమ్ ఆడిన లగడపాటి, బొమ్మ పడినా బొరుసు పడినా లగడపాటికి నష్టం వుండదు

బొమ్మపడితే
మహాకూటమి వైపు సర్వే ఎందుకు అనుకూలంగా చెప్పాల్సి వచ్చిందింటే క్షేత్రస్థాయిలో మహాకూటమిని స్వాగతించటంలేదనే వాస్తవం గ్రహించిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ కోసమో లేక కమ్మ కులం కోసమో లేక రెంటి కోసమో గణనీయంగా వున్న సెటిలర్స్ ని ప్రభావితం చేయాలని ఈ అవాస్తవ సర్వే వ్యూహం రచించారు.

గెలిచే పార్టీ వైపుకి మొగ్గే ఓటర్ల శాతం గణనీయంగా వుంటుంది. వారిని టార్గెట్ ప్రభావితం చేయదరచి వదిలిన ఎర లగడపాటి సర్వే. తెలంగాణలో హంగ్ వచ్చినా ఏపీలో కాంగ్రెస్-టీడీపీ కూటమిని సీమాంధ్రు ప్రజలు ఆమోదించే అశకాశం వుంటుంది. ఇది కాంగ్రెస్-కమ్మ ఇరువురికీ జీవన్మరణ సమస్య కావున ఇరువురి భవిష్యత్తు కోసం దిశగా చేసిన గట్టి ప్రయత్నం లగడపాటి సర్వే. ఈయన చేసిన ప్రయత్నం ఫలించి సెటిలర్స్ మహాకూటమి వైపుకి మొగ్గు చూపి వారు అధికారంలోకి వస్తే ఆయన విద్యుత్తు కొనుగోలు కొనసాగుతుంది దానికి అదనంగా కాంగ్రెస్ పరంగా ఐనా కమ్మ పరంగా ఐనా లభించే తాయిలాలు వుండనే వుంటాయి.

బొరుసు పడితే
ఒకవేళ సర్వేని జనం నమ్మక టీఆరెస్ కే ఓటేస్తే ఎలా అన్న ప్రశ్న లఖడపాటికి రాక మానదు. తీవ్రమైన డబ్బు కొరతలో లగడపాటి తెలంగాణ ఎన్నికల మాటున డబ్బు గడించేందుకు పధకం పన్ని బహు చక్కగా అమలు చేశారు.
వినియోగించుకున్నారు.

ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. లగడపాటి సర్వేకి విశ్వసనీయత వున్నది. సరిగ్గా దీనినే ఎరగా వేసి పూర్తిగా క్యాష్ చేసుకున్నాడు లగడపాటి. బెట్టింగ్ రాయుళ్ళకి మహాకూటమి గెలుపొందుతుందని భారీగా అంచనాలు పెంచేశారు. ఆయన స్వయానా టీఆరెస్ మీద పందెం కాస్తూ ఇతరులు మహాకూటమి వైపు పందెం కాసేలా ఆయన సర్వే నివేదిక రూపొందించారు. ఒకవేళ సర్వే ప్రభావితం చేస్తే మహాకూటమి ప్రభుత్వంలో లాభాలు లేకపోతే బెట్టింగ్ లో కోట్ల రూపాయల లాభాలు.
సరిగ్ఖా ఈ వ్యూహాన్నే పకడ్బందీగా అమలు చేశారు లగడపాటి. ఆయన టీయారెస్ గెలుపు పై పందెం కాస్తూ ఆశలు లేని మహాకూటమి వైపున పందెం కాసేలా జనాలని ప్రేరేపించారు.

ఈ బెట్టింగ్ లో లగడపాటి 1000-2000 కోట్లు సొమ్ము చేసుకున్నారని అంచనా.

ఇదీ లగడపాటి మార్క్ వ్యాపార రాజకీయం.
నేను రాజకీయాలలో లేను అని పదేపదే చెప్పే లగడపాటి గారు
డబ్బు సంపాయంచాలంటే రాజకీయాలలో ఉండవలసిన అవసరం లేదపి రుజువు చేశారు.

To Top

Send this to a friend