క‌ర్నూలు జిల్లాకు చేసిందేమిటి?

ఏపీలో నంద్యాల రాజ‌కీయాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. నంద్యాల‌పై ప్ర‌భుత్వం ఎప్పుడూ లేని ప్రేమ‌ను కురిపిస్తోంది. ఉప ఎన్నిక‌ల కోస‌మే నంద్యాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టింద‌ని.. జ‌గ‌మెరిగిన స‌త్యం. అంతేగానీ నంద్యాల‌కు గానీ, మొత్తంగా క‌ర్నూలు జిల్లాకు గానీ ఇప్ప‌టివ‌రకు ప్ర‌భుత్వం చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లాపై ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిస్తుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర‌విభ‌జ‌న జ‌రిగాక‌.. 2014లో స్వాతంత్య్ర వేడుక‌ల‌ను క‌ర్నూలులో వైభవంగా నిర్వ‌హించారు సీఎం చంద్ర‌బాబు. ఆ సంద‌ర్భంగా జిల్లాపై వ‌రాల జ‌ల్లుకు కురిపించారు. ఆయ‌న ఇచ్చిన హామీలు ఒకసారి చూస్తే..

హైద‌రాబాద్‌కు ధీటుగా, దేశంలోనే తొలి స్మార్ట్ సిటీగా క‌ర్నూలు అభివృద్ధి.
జిల్లాలో ఓర్వ‌క‌ల్ ద‌గ్గ‌ర ఎయిర్‌పోర్టుతో పాటు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్ నిర్మాణం.
నంద్యాల‌లో అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు.
డోన్‌లో మైనింగ్ యూనివ‌ర్సిటీ స్థాప‌న‌.
క‌ర్నూలు శివారులో ఐఐఐటీ ఏర్పాటు.
న‌ల్ల‌మల్ల ఫారెస్ట్ డివిజ‌న్‌లోని నందికొట్కూరులో గొర్రెలు, మేక‌లు, పిచ్చుక‌ల పెంప‌కంపై రీసెర్చ్ సెంట‌ర్‌.
నంద్యాల టౌన్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ సీడ్ ప్రొడ‌క్ష‌న్ కార్పొరేష‌న్‌.
బ‌న‌గాన‌ప‌ల్లె డివిజ‌న్‌లో సిమెంట్ ఇండ‌స్ట్రీ.
ఆలూరులో జింక‌ల సంర‌క్ష‌ణ కేంద్రం.
ఎయిమ్స్ సాయంతో క‌ర్నూల్ జిల్లా ఆస్ప‌త్రిలో వైద్య‌సేవ‌ల పెంపు.
క‌ర్నూల్ టౌన్‌ని కృష్ణ‌ప‌ట్నం పోర్టుతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌ను క‌లుపుతూ హైవేల నిర్మాణం.
జిల్లాలో సోలార్‌, విండ్ ప‌వ‌ర్ హ‌బ్స్ ఏర్పాటు.

ఇవ‌న్నీ స్వ‌యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీలు. ఈ వరాల జ‌ల్లు కురిపించి మూడేళ్ల‌వుతోంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌టీ అమ‌లుకు నోచుకోలేదు. సాక్షాత్తు సీఎం ఇచ్చిన హామీలే కాగితాల‌కు ప‌రిమిత‌మ‌య్యాయి. ఇచ్చిన హామీలే ప‌ట్టాలకు ఎక్కలేదు. ఇక కొత్త‌గా ఏం చేస్తారంటూ వాపోతున్నారు క‌ర్నూలు ప్ర‌జ‌లు. అందుకే త‌మ జిల్లాపై ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని వరాల జ‌ల్లు కురిపిస్తున్నారు. కానీ గ‌త హామీల సంగ‌తి ప‌రిశీలిస్తే చంద్ర‌బాబు అవ‌కాశ వాదం బ‌య‌ట‌ప‌డుతోంది. ఉప ఎన్నిక‌ల కోస‌మే చంద్ర‌బాబు ఈ డ్రామాలు ఆడుతున్నార‌నే సంగ‌తి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంటున్నారు అక్కడి జనాలు.

To Top

Send this to a friend