చంద్రబాబు గతకీర్తికి కేటీఆర్ పరేషాన్..

చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి ఏపీ సీఎంగా 9 ఏళ్లు పాలించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి హైదరాబాద్ ను పరిశ్రమల హబ్ గా మార్చరు. చంద్రబాబుతో లబ్ధి పొందిన వారు ఇప్పుడు కృతజ్ఞతగా ఇప్పుడు ఆయనకు గౌరవమర్యాదలు ఇస్తున్నారు.. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో టెక్స్‌టైల్స్‌ ఇండియా -2017 జాతీయ స్థాయి ప్రదర్శన సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఇందులో ఓ పారిశ్రామికవేత్త చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు ఆసక్తి రేపాయి.

గుజరాత్ లో నిర్వహించిన టెక్స్ టైల్స్ సదస్సులో కేటీఆర్ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న టెక్స్‌టైల్స్‌ పార్క్ గురించి తెలంగాణా టెక్స్‌టైల్స్‌ పాలసీ గురించి అరవింద్ గ్రూప్ చైర్మన్ సంజయ్ లాల్ భాయ్ కు చెప్తూ ఉండగా సంజయ్ లాల్ భాయ్ కలిపించుకుని.. “ఇవన్నీ నాకు తెలుసు.. ఇప్పుడేమిటి? నాకు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనను కలిసే అద్భుతమైన అవకాశం దక్కింది. ముఖ్యంగా చంద్రబాబు అందించిన అద్భుతమైన పరిపాలనకు, ఆయన అడ్మినిస్ట్రేషన్ కు నేను వీరాభిమానిని” అంటూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు.. ఒక పక్క కేటీఆర్ ఇంగ్లీష్ లో ఎదో మాట్లాడబోతుంటే… డెనిమ్ మాన్ అఫ్ ఇండియా సంజయ్ లాల్ భాయ్ మాత్రం అవేమి పట్టించోకుండా చంద్రబాబు పరిపాలనా దక్షతను అహ్మదాబాద్‌ వేదికగా మరో సారి ఈ ప్రపంచానికి తెలియచేసారు.

సదస్సులో చంద్రబాబు గొప్పతనాన్ని అందరూ కీర్తిస్తుండడంతో కేటీఆర్ సైలెంట్ అయ్యారు. కేటీఆర్ తన ప్రసంగాన్ని ఆపేసి చంద్రబాబు గొప్పతనంపై మిన్నకుండిపోయాడట.. ఇలా గడిచిన ఉమ్మడి పాలనలో చంద్రబాబు చేసిన పారిశ్రామిక ప్రగతి ఆయనకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. గుజరాత్ సదస్సులో ఆయనకు పేరు తెచ్చింది.

To Top

Send this to a friend