కేటీఆర్-పవన్ భేటి.. కొట్టిపారేయడానికి లేదు..


పవన్ నటుడిగా.. ఏపీ రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు.. తెలంగాణ సీఎం కొడుకు మంత్రి కేటీఆర్ పవన్ ను కలవడం.. కాటమరాయుడు సినిమా ను పొగడడం రాజకీయంగా సంచలనం రేపింది. అంతేకాదు పవన్ కాటమరాయుడు చూశానని.. అద్బుత నటనకు కంగ్రాట్స్ అని పవన్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పెట్టారు. అనంతరం పవన్ కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పి కేటీఆర్ రాజకీయ, సామాజిక, సినిమా రంగాలపై గంటకు పైగా చర్చించామని పవన్ విషయాన్ని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవన్ కీరోల్ గా నిలవబోతున్నాడు. ఈనేపథ్యంలోనే తెలంగాణలో నూ పోటీచేయాలనుకుంటున్నాడు. మంత్రి కేటీఆర్ ను కలవడం.. రాజకీయాలపై చర్చించడంతో ఇదేదో పెద్ద ప్లానే వేశారనే సమాచారం అందుతోంది. ఏపీలో పొలిటికల్ గా ముందుకెళ్లడంతో పవన్.. కేటీఆర్ నుంచి సూచనలు స్వీకరించినట్టు సమాచారం. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్ అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏపీలో పవన్ వస్తారనే నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సీఎంలిద్దరూ భేటి కావడం.. రహస్య చర్చలు జరపడం సంచలనం రేపింది.

ఇక కేటీఆర్ కాటమరాయుడు సినిమాలో పవన్ టీం అంతా చేనేత దుస్తులు వాడడంపై అభినందించారు. ఇలానే చేనేతన్నలు ప్రోత్సహించాలని కేటీఆర్ పవన్ కు విజ్ఞప్తి చేశారు.

To Top

Send this to a friend