కేటీఆర్ ను సీఎం చేస్తే..హరీష్?


ఇది చాలా హాట్ క్వచ్చన్.. అదీ తెలంగాణలో టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న మంత్రి హరీష్ రావుకు నేరుగా సంధించిన ప్రశ్న.. ‘వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొని కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రకటిస్తే’ అనే ప్రశ్నను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న హరీష్ రావును అడిగారు. దీనికి హరీష్ రావు ఏం చెప్పారనేదానిపై ఆదివారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ ప్రశ్న ఇంటర్వ్యూ అప్పుడే ప్రసారం అవుతుంది..

హరీష్ రావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పలు సంచలన విషయాలు చెప్పాడు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు స్కెచ్ లో కీలకంగా వ్యవహరించింది హరీష్ రావేనని విషయం స్పష్టమైంది. అంతేకాదు.. లోకేష్ బాబు ఎన్నికలలు కన్నా తెలంగాణలో టీడీపీ చచ్చిన పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు అసలు నాయకులే లేరని.. అందుకే బయట నుంచి బాహుబలి రావాలని కోరుకుంటున్నారని హరీష్ ఎద్దేవా చేశారు.

కేసీఆరే మా నేత.. కేసీఆర్ లేకుంటే హరీష్ లేడు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కేసీఆర్ ఏం చెబితే అది చేస్తా.. భవిష్యత్తులో ఎవ్వరూ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అని హరీష్ చెప్పారు.. కేటీఆర్ సీఎం అయితే.. హరీష్ ఏం చేస్తాడనే ప్రశ్నకు సమాధానం కోసం మాత్రం ఆగాల్సిందే..

హరీష్ రావు సంచలన విషయాలు కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend