‘కాదలి’ షో మద్యలోనే వెళ్లిపోయిన కేటీఆర్‌


అంతా కొత్త వారితో కొత్త దర్శకుడు పట్టాభి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాదలి’. దర్శకుడు పట్టాభి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు చిన్ననాటి స్నేహితుడు. చిన్నప్పటి నుండి పట్టాభికి సినిమాలు అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తితోనే సినిమా ఇండస్రీకి వచ్చాడు. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పటాభి ఎట్టకేలకు సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా వెనుక కేటీఆర్‌ ఉన్నాడు అనే విషయం ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్న విషయం. నిర్మాణంతో పాటు సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా కేటీఆర్‌ చాలా శ్రద్ద చూపించాడు.

‘కాదలి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల నుండి మొదలు పెడితే అంతట కూడా కేటీఆర్‌ మార్క్‌తో సెలబ్రెటీలు ముందుకు వచ్చారు. ఇక ఆడియో వేడుకలో రామ్‌ చరణ్‌ పాల్గొనడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. స్వయంగా రామ్‌చరణ్‌కు ఫోన్‌ చేసి ‘కాదలి’ ఆడియో వేడుకకు రావాల్సిందిగా కేటీఆర్‌ కోరడం, రామ్‌ చరణ్‌ రావడం జరిగింది. దాంతో ‘కాదలి’ చిత్రంపై కేటీఆర్‌ ఎంత శ్రద్దగా ఉన్నాడు అనే విషయం వెళ్లడైంది.

అంతా సజావుగా సాగిపోతున్న ‘కాదలి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్నేహితులతో పాటు కేటీఆర్‌ నేడు ‘కాదలి’ ప్రత్యేక షోను హైదరాబాద్‌లో చూడటం జరిగింది. సినిమా పూర్తి కాకుండానే కేటీఆర్‌ మద్యలో వెళ్లి పోవడం అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది. కేటీఆర్‌కు సినిమా నచ్చలేదా, లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉన్నందున వెళ్లి పోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ‘కాదలి’ కోసం అంత చేసిన కేటీఆర్‌ మద్యలో వెళ్లి పోవడంతో దర్శకుడు పట్టాభి కాస్త ఇబ్బంది ఫీల్‌ అయినట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend