కేటీఆర్ కు పదవి వద్దు..

ముస్లిం, ఎస్టీలకు తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందని విలేకరులు కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ ‘మీరు చెప్తా చేస్తానని’ విలేకరులతో సరదాగా అన్నారు. అనంతరం మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఎందుకు చేయాలి. ఏపీలో చంద్రబాబు నాయుడు అలా చేసే తలనొప్పులు తెచ్చుకున్నారు. ’ అని కేసీఆర్ తెలంగాణలో 2019 ఎన్నికల వరకు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉండదని తేల్చిచెప్పారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులకు కేసీఆర్ ప్రకటన నిరాశకు గురిచేసింది.

ఇక కొద్దికాలంగా పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ ఈ సారి పార్టీ వార్షికోత్సవంలో కార్యనిర్వహక అధ్యక్షుడిని చేస్తారా అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిచ్చారు. కేటీఆర్ కు అధ్యక్ష పదవి ఊహాగానేలేనని.. అలాంటిదేమీ లేదన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం ఈ నెల 16న తనే నామినేషన్ వేస్తున్నట్టు కేటీఆర్ స్వయంగా చెప్పారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో నిర్వహించే టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ కోసం తెలంగాణ సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు , నాయకులు కూలీ పనులు చేయాలని కేసీఆర్ తమ పార్టీ నేతలకు ఆదేశించారు. దాని ద్వారా వచ్చిన సొమ్ములతో పార్టీ ఆవిర్భావ సభకు వాహనాలు సమకూర్చి జనాలను తీసుకురావాలని సూచించారు.

To Top

Send this to a friend