కేటీఆర్ జీ.. ఏపీ లో ..


‘మేమిక్కడి రాజకీయ నేతలు, ప్రభుత్వంతో విసిగిపోయాం. మీ లాంటి సమర్థ నాయకులు ఏపీకి అవసరం.. మీకోసం మేం ఎదురుచూస్తున్నాం.. వెంటనే ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించండి.. తెలంగాణకే టీఆర్ఎస్ ను పరిమితం చేయొద్దు.. టీఆర్ఎస్ విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాం..’ అని ఓ ఆంధ్రా యువకుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి కేటీఆర్ కూడా ఆసక్తికరంగా బదులిచ్చాడు..

అయితే ఏపీ యువకుడు చేసిన ఆహ్వానాన్ని మంత్రి కేటీఆర్ సున్నితంగా తిరస్కరించాడు. ‘తెలంగాణ కోసం మేమెంతో చేయాల్సి ఉంది బ్రదర్.. ఏదైనా మీ కామెంట్ కు థ్యాంక్స్’ అంటూ కేటీఆర్ ఆ యువకుడికి సమాధానమిచ్చాడు.

కేటీఆర్, కేసీఆర్ లపై ఏపీ లోని ప్రజలు, యువకులు కూడా అభిమానం పెంచుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా హిట్ అయ్యాయి. అందుకే ఈ అభివృద్ధి ని చూసి ఏపీలోని చాలా చోట్ల కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. ఇలా అప్పుడప్పుడు అభిమానం కూడా తన్నుకువస్తోంది.

To Top

Send this to a friend