ఆ చిన్నారి మరణం కేటీఆర్ ను కదిలించింది..

కన్నబిడ్డ చనిపోతున్నా స్పందించని ఓ తండ్రి కర్కశత్వం మంత్రి కేటీఆర్ ను కదిలిచింది. ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ట్విట్టర్ వేదికగా ఇంతటి అమానవీయ సంఘటన జరిగిందా అని వాపోయారు. సమాజంలో విలువలు ఇంతలా పడిపోతున్నాయనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి తగిలిన దెబ్బగా అభివర్ణించారు.
తల్లిదండ్రుల మధ్య విభేదాలు వేరుగా ఉంటాయి.. భార్యను వద్దనుకున్నావ్ సరే.. కన్న కూతురిపై ఏం కోపమో ఏమో ఆ తండ్రి బిడ్డ చనిపోతున్నానని మేసేజ్ పెట్టినా స్పందించలేదు. నాన్న నన్ను కాపాడు అని వాట్సాప్ లో వీడియో తీసి పంపినా కనికరించలేదు ఆ కఠినాత్ముడు.. హైదరాబాద్ కు చెందిన చిన్నారి సాయిశ్రీ క్యాన్సర్ తో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తనకు వైద్యం చేయించు నాన్న.. బతికించు అని తండ్రికి వీడియో తీసి పంపింది. దీనిపై ఆ తండ్రి స్పందించలేదు. పాప పరిస్థితి విషమించి చనిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తున్నారు..
మంత్రి కేటీఆర్ ఈ వీడియో చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ట్విట్టర్ లో స్పందించారు. మానవీయ విలువలు సమాజంలో రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు. కన్నకూతురు చనిపోతున్న స్పందించని కసాయి తండ్రులు ఈ సమాజంలో ఉన్నారా అని కేటీఆర్ వాపోయారు. సాయిశ్రీ వీడియో చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని కేటీఆర్ ట్విట్టర్ లో ఉద్వేగంగా రాసుకొచ్చారు.
చిన్నారి సాయి శ్రీ తండ్రికి పంపిన వీడియోను కిందచూడొచ్చు..
To Top

Send this to a friend