కేటీఆర్ సీఎం కోసం ఇంత పెద్ద ప్లానా.?


బంపర్ డ్రా కోసం పిలిస్తే ఏమో అనుకున్నాం.. కానీ దీని వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..? ఇదంతా కేసీఆర్-ఆ మీడియా ఎండీ వ్యూహరచన అన్న అనుమానాలు బలంగా వినిపిస్తాయి. ఎందుకంటే.. అటు కేటీఆర్ ను మీడియా ఎండీ బంపర్ డ్రా తీయమని పిలవడమే ఓ సంచలనమైతే.. కేటీఆర్ రావడం.. బంపర్ డ్రా తీయడం.. అనంతరం ఏకాంతంగా గంటపాటు చర్చలు జరపడం జరిగిపోయింది .. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సీఎం కొడుకుకు లైన్ క్లియర్ చేసే బాధ్యత సదురు మీడియా ఎండీ నెత్తిన పెట్టుకున్నారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో మీడియా ఎండీ చేతిలో హరీష్ ఇరుక్కుపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం క్యాండిడేట్ అయితే అభ్యంతరం లేదని ఒప్పుకున్నారు.. వ్యూహాత్మకంగానే హరీష్ రావుతో మీడియా ఎండీ ఇంటర్వ్యూ నిర్వహించి ఆయన చేతే కేటీఆర్ ను సీఎంగా ధ్రువీకరించడం జరిగిపోయాయి.

ఈ మొత్తం వ్యవహారంలో ఆ మీడియా ఎండీ ఎవరయ్యా అంటే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కాగా.. తెరవెనుక ఉండి నడిపించింది కేసీఆర్ అని విశ్వసనీయ సమాచారం. కొన్నాళ్లుగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండడం లేదు. ఆయన కొత్త సీఎం నివాసం ప్రగతి భవన్ లోకి మారాక అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలు.. జనాలను కలుసుకునే పనులన్నీ అందులోనే చేస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని.. వచ్చే 2019 ఎన్నికల తర్వాత కొడుకు కేటీఆర్ కు సీఎం పీఠం అప్పగించేసి రెస్ట్ తీసుకుంటాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తర్వాత పార్టీలో కింగ్ మేకర్ గా ఉన్నది హరీష్ రావే.. అందుకే హరీష్ అడ్డును వ్యూహాత్మకంగా తొలిగించే బాధ్యతను కేసీఆర్.. తన మిత్రుడు, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై పెట్టారు..

అందుకే రాధాకృష్ణ .. మొదట కేటీఆర్ తో ఆంధ్రజ్యోతి బంపర్ డ్రా కోసం ఆహ్వానించి చర్చలు జరిపారు. ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చాక.. అమలు చేశారు. రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హరీష్ రావును పిలిచారు. ఆయనతోటే ‘కేసీఆర్.. కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నారని.. మీరు ఆమోదిస్తారా.. వ్యతిరేకిస్తారా’ అని హరీష్ ను అడిగించేశారు. దీనికి హరీష్.. ‘కేటీఆర్ ను సీఎం చేసినా.. ఏదీ చేసినా కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తానని..’ చెప్పేశారు. ఇలా విపత్కర పరిస్థితి సృష్టించి కేటీఆర్ సీఎం కావడానికి ఉన్న ప్రధాన అడ్డంకి అయిన హరీష్ ను బాగా ఇరికించి తప్పుకునేలా చేయడంలో రాధాకృష్ణ-కేసీఆర్ కృతకృత్యులయ్యారు. ఇప్పుడు కేసీఆర్ డైరెక్టుగా కేటీఆర్ ను సీఎం చేసినా వ్యతిరేకించే వారే లేకుండా పోయారు. ఇలా కాగల కార్యం రాధాకృష్ణ తీర్చడంతో అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ సంతోషంలో ఉన్నారు.. ఇక రాధాకృష్ణకు ఆమాత్రం ప్రతిఫలం కేసీఆర్ నుంచి కచ్చితంగా దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend