పెట్టుబడుల ప్రవాహి..

తెలంగాణ మంత్రివర్గంలో ఫుల్ బిజీగా ఉండే మంత్రివర్యులు ఎవరంటే అది ఖచ్చితంగా కేటీఆర్.. రాష్ట్రంలో, విదేశాల్లో, ఇటు నియోజకవర్గంలో, అటు సినిమా వాళ్లతో అందరితోనూ కేటీఆర్ భేటిలు అవుతూ సామాజికమాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ అక్కడ తెలంగాణకు పెట్టుబడుల కోసం విస్తృత పర్యటనలు జరుపుతున్నారు. అమెరికాలోని పేరొందిన కంపెనీల సీఈవోలను కలుస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.

 

అమెరికాలోని పెద్ద కంపెనీ అయిన సిస్కో చైర్మన్ ను కలిసిన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు అంగీకరించారు. ఎలక్ర్ట్రానిక్స్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో సిస్కో ప్రపంచంలోనే పెద్ద గుర్తింపు దక్కించుకుంది. ఆ సంస్థను తెలంగాణకు రప్పించడంలో కేటీఆర్ విజయం సాధించారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో 100శాతం కృషి చేస్తున్నారు. ఆయన కృషి తగినట్టుగా వివిధ కంపెనీలు హైదరాబాద్ వస్తున్నాయి. ఇటీవల కాగ్ నివేదికలో భారత దేశంలోనే తెలంగాణ 17శాతం వృద్ది రేటు సాధించడంలో కేటీఆర్ పాత్ర ఉంది. కేటీఆర్ తీసుకొచ్చిన పరిశ్రమల వల్లే వృద్ధిరేటు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ డెవలప్ మెంట్ కు ఐకాన్ గా కేటీఆర్ మారారని ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

To Top

Send this to a friend