కేటీఆర్ 5 లక్షల ఐస్ క్రీం ..


గొప్పొళ్లకు.. సామాన్యులకు అదే తేడా.. గ్రామస్థాయిలోని పారిశుధ్య కార్మికుడు రోజంతా కష్టపడినా కనీసం 100 రూపాయలు కూడా అతడికి గిట్టుబాటు కాని పరిస్థితి.. కానీ స్వయంగా సీఎం కొడుకు అయ్యిండి.. కోట్లు ఉన్నా కానీ.. పార్టీ సభ కోసం కష్టపడితే ఐస్ క్రీం తయారు చేస్తే రూ.5 లక్షలు పెట్టి కొంటారా.? అదే ఓ సామాన్యుడికి ఆ రేటు కడతారా..? కట్టరు.. ఎందుకంటే వీరితో పని అవుతుంది. కార్మికుడితో అస్సలు అవసరమే లేదు. పొలిటికల్ డ్రామా కూలీల గోల ఇప్పుడు టీఆర్ఎస్ కు కాసులు కురిపిస్తుండగా.. సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.

కేటీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఒక్క రోజు శ్రమదానం చేశాడట… ఆ గంట శ్రమ దానానికి కూలీ 7.5 లక్షలట… అది కూడా పార్లర్ లో చాలా కష్టపడి ఐస్ క్రీంలు, జ్యూస్ లు అమ్మాడట… ఆ కష్టం చూసి తట్టుకోలేక ఎంపీ మల్లారెడ్డి ఐస్ క్రీమ్ ను 5 లక్షలకు కొన్నాడట… మరొకరు జ్యూస్ 1.30 లక్షలకు తాగారట… రక్తాన్ని చెమటగా చేసి అంతిమంగా 7.50 లక్షలు సంపాదించాడట… జనం చెవిలో కాలీ ఫ్లవర్ లట…

శ్రమకు వందో, రెండు వందలో కూలీ ఇస్తారు కేటిఆర్.. లక్షల డొనేషన్లు ఎవడూ ఇవ్వడు.. మరి గంట శ్రమకు 7.50 లక్షలు ఖరీదు కట్టినవాడివి, దశాబ్దాల గ్రామ పంచాయతీ కార్మికుల వెట్టిచాకిరీకి కనీస వేతనాలు ఎందుకు చెల్లించరు.? దొర చెయ్యి వేస్తే లక్షలు, దళితులు చాకిరీ చేస్తే వందలు కూడా ఇవ్వరా..? ఇదే మరి బంగారు తెలంగాణ అని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు..

To Top

Send this to a friend