క్రిష్ ముందడుగు


తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి స్ఫూర్తితో దర్శకుడు క్రిష్ మరో పెద్ద ముందడుగు వేశాడు. బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను ‘మణికర్ణిక’ అనే పేరుతో సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు. ఇందులో బాలీవుడ్ అగ్రహీరోయిన్ కంగనారౌనత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు క్రిష్.. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో మరో బయోపిక్ గా రాబోతోంది. బాహుబలి తర్వాత మరో చారిత్రక గాథ తెరపైన చూపించడానికి క్రిష్ చేస్తున్న ఈ ప్రయత్నం అంతటా ఉత్కంఠ రేపుతోంది.
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె లాంటి సినిమాల్లో మానవ సంబంధాలు, లక్ష్యాలు, ఆర్థిక బంధాలను కళ్లకు కట్టినట్టు చూపించి క్రిష్ శభాష్ అనిపించుకున్నాడు. క్రిష్ సినిమాల్లో జీవన విలువలు ప్రతిఫలిస్తాయి. బాలయ్యతో శాతకర్ణి సినిమాను తక్కువ బడ్జెట్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. డబ్బులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా తక్కువ టైంలో సినిమా తీసి గొప్ప దర్శకుడిగా కీర్తినందుకున్నాడు. యుద్ధ సన్నివేశాలు.. ఎమోషన్స్ కూడా బాగా తెరపై చూపించారు.
ఝాన్నీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనే మైలురాయి లాంటిది. వీరవనిత ఝాన్సీ బాల్యం, విద్యాభాస్యం.. ఆమె పెళ్లి, ఆ తర్వాత రాణి.. భర్త మరణంతో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు సహా వెన్నుపోటుతో బ్రిటీష్ వారు ఝాన్సీని చంపిన తీరును కథలో క్రిష్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఎన్నో సీరియళ్లలో ఝాన్సీ కథ వచ్చింది. మరి ఇందులో క్రిష్ కొత్తగా ఏం చూపుతాడనే.. ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

To Top

Send this to a friend