క్రిష్‌ ‘మణికర్ణిక’ అనుమానమేనా?


బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ భారీ విజయం సాధించడంతో క్రిష్‌ స్థాయి పెరిగి పోయింది. ఆ కథను బాగా టేకప్‌ చేశాడని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దాంతో తాజాగా ఆయనకు బాలీవుడ్‌లో లక్ష్మిబాయి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను పోషించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక విమర్శలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాంతో ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్న ప్రకటించారు. ఈ సమయంలోనే బాలీవుడ్‌కు చెందిన దర్శకుడు ఆ కథ నాది అంటూ తెరపైకి వచ్చాడు. ఆ వివాదం సర్దుమనిగిందో లేదో వెంటనే మరో వివాదం మొదలైంది. ‘మణికర్ణిక’ చిత్రానికి క్రిష్‌తో పాటు తాను కూడా దర్శకత్వం వహిస్తున్నట్లుగా కంగాన రనౌత్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాంతో ఆ విషయమై కాస్త సీరియస్‌ అయ్యాడు. ‘మణికర్ణిక’కు తాను మాత్రమే దర్శకుడిని అని, కంగనా దర్శకత్వం వహించడం అనేది అవాస్తవం అని క్రిష్‌ క్లారిటీ ఇచ్చాడు.

To Top

Send this to a friend