కొత్త పార్టీపై ఎన్టీఆర్ స్పందన..


కొద్దిరోజులుగా నెట్ లో ఒకటే సందడి.. ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టారని.. దీనికి ‘నవభారత్ నేషనల్ పార్టీ’ అని పేరు పెట్టారని.. దీనికి ఏపీ అధ్యక్షుడిగా నియమించారని ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తోంది. ఇది ఆ నోట ఈనోట ఎన్టీఆర్ వరకు వెళ్లిందట..

ప్రస్తుతం జైలవకుశ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.. ఎన్టీఆర్ కొత్త పార్టీ గురించి అభిమానుల ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ బాగా ‘నవ్వేశాడట.. నేనేంటి రాజకీయాలు ఏంటి?’ అని జోకులేశాడట.. ఇటువంటి వార్తలు ఎక్కడినుంచి వస్తాయోనని అన్నాడట..

అనంతరం ఈ వార్తలను అభిమానులు, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. వదిలేయాని.. రాజకీయాల్లోకి రావాలనుకుంటే తానే స్వయంగా ప్రకటన చేస్తానని.. అయినా 2009లో ఎన్నికల ప్రచారం చేశాక.. ఇప్పటివరకు రాజకీయాల గురించి ఆలోచించలేదని.. అలాంటి ఉద్దేశం ప్రస్తుతానికి తనకు లేదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ఇలా రహస్యంగా రానని.. ముందు తన కాన్ సన్ట్రేషన్ మొత్తం సినిమాలపైనే ఉందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

To Top

Send this to a friend