కొత్తగా 200నోటు


క్యాష్ లెస్ ఇండియాగా మార్చేదామనుకున్న ప్రధాని మోడీనే మారిపోయాడు. దేశంలో పేదలు, నిరక్ష్యరాస్యులు, వృద్ధులు ఉన్న దృష్ట్యా క్యాష్ లెస్ లావాదేవీలు సాధ్యం కాదని నిరూపితమైంది. నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలన్నింటిని అంచనావేసిన మోడీ చివరకు తాను కోరుకున్న క్యాష్ లెస్ ఇండియా జపాన్ని వీడాడు..

కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా దేశంలోకి రూ.200 నోటును తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ డిజైన్ రూపొందించి మోడీ ఆమోదం కోసం పంపారు. మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జూన్ నుంచి జనంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ఆర్బీఐ చేస్తోంది..

కాగా దీంతో పాటు రూ.2 వేల నోటును రద్దు చేసేందుకు కేంద్రం నిర్ణయించదని.. దీని వల్ల నల్లడబ్బు దాచడం సులభమైందనే భావన నెలకొనడంతో మోడీ అండ్ కో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్తగా 100 నోటును కూడా తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అయితే పాత 100 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని కొత్త నోటులో మరిన్ని స్పెషల్ ఫీచర్లు ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. నకిలీ కరెన్సీ తయారీకి వీలుకాని రీతిలో కేంద్రం కొత్తనోట్ల ముద్రణను చేపడుతుండడం గమనార్హం.

To Top

Send this to a friend