కోటా క్యా కియా.. ప్రదీప్ డర్ గయా..

పరభాష నటుల వ్యవహారంపై ఎప్పుడూ విమర్శలు చేసే సీనియర్ తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు.. ఈసారి తెలుగులో విలన్ గా వెలుగొందుతున్న ప్రదీప్ రావత్ ను షూటింగ్ లో చెడమడా తిట్టేయడం.. హాట్ టాపిక్ గా మారింది. కోటా తిట్టిన తిట్లకు అలిగి షూటింగ్ నుంచి విలన్ ప్రదీప్ రావత్ వెళ్లిపోయాడట.. కోటా శ్రీనివాసరావు ఆ సినిమాలో నటిస్తే తాను చేయనని తెగేసి చెబుతున్నాడట.. కోటా ఉంటే తనను సినిమాలో తీసుకోవద్దు అని డైరెక్టర్లకు చెప్పేశాడట.. ఇంతకీ కోటాకు, బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో విలన్ గా చేస్తున్న కోటాకు వివాదానికి కారణమేంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ప్రదీప్ రావత్ తెలుగు సినిమాల్లో సై సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఇప్పటికి 12 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి. అయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రదీప్ సభ్యత్వం తీసుకోలేదట.. ఈ మధ్య కోటా శ్రీనివాసరావు.. విలన్ ప్రదీప్ రావత్ తో కలిసి ఓ సినిమాలో నటించారు. అప్పుడే సీనియర్ అయిన కోటా శ్రీనివాసరావు .. ప్రదీప్ రావత్ యాక్టింగ్, తెలుగు రాకపోవడం.. డైలాగులు గుర్తుపెట్టుకొని చెప్పకపోవడంపై సీరియస్ అయ్యాడట.. 2004 నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నావ్ కనీసం .. తెలుగు నేర్చుకునే జ్ఞానం లేదా..? పోనీ తెలుగు పదాలను హిందీలో రాసుకొని అయినా పలకడం చేతనైతే లేదా అని షూటింగ్ లోనే ప్రదీప్ రావత్ ను చెడమడా కోటా తిట్టేశాడట.. అంతేకాదు కళ్లు ఇంత పెద్దవి చేసి.. ఉరిమి ఉరిమి చూడడం విలనిజమా.? గాల్లో నోటికొచ్చినట్టు ఏదో వాగితే.. వీడికి లక్షలు పోసి డబ్బింగ్ చెబుతారా.? అని ప్రదీప్ ను కడిగిపాడేశాడట..

ఇంకా కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను హిందీలో, తమిళ్, మళయాళం, కన్నడలో చేశాను. అక్కడి భాషను తెలుగులో రాసుకొని ప్రాక్టీస్ చేసి పలుకుతా.. ఇలా ప్రదీప్ లా ఏదో నోటికొచ్చినట్టు చెప్పి డబ్బింగ్ లో చెప్పమనను అని ’ప్రదీప్ పై తిట్ల వర్షం కురిపించాడట.. దీనికి నొచ్చుకున్న ప్రదీప్ రావత్ అవమానంతో షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయాడట.. కోటా శ్రీనివాసరావు ఈ విలన్ ప్రదీప్ ను తిట్టడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

To Top

Send this to a friend