కొడుకు కోసం కొత్త సినిమా..

ఎప్పుడు రొటీన్ కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకొని హిట్ కొట్టే నాగార్జునకు ఆయన కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. నాగచైతన్య, అఖిల్ లకు ఇప్పటివరకు టాలీవుడ్ ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ పడలేదు. నాగచైతన్య అప్పుడో ఇప్పుడో మెరుస్తూ కనుమరుగైపోతున్నాడు. ఇక అఖిల్ మొదటి మూవీనే పెద్ద డిజాస్టర్ అయ్యింది. అందుకే ఈసారి పకడ్బందీ ప్రణాళికతో వెళ్తున్నారు. యువదర్శకుడు కళ్యాణ్ కృష్ణ రూపొందించిన కథకు ఓకే చెప్పిన నాగార్జున.. నాగచైతన్యతో ఆ సినిమాను పట్టాలెక్కించాడు.

తన పెద్ద కొడుకు కోసం నాగార్జున మరోసారి నిర్మాతగా మారి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమా తీశాడు. నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చేద్దాం’.. ఈ మూవీ టీజర్ ను ఆదివారం లాంచ్ చేశారు..

ఆద్యంతం కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాగచైతన్య ,రకుల్ జంట పెళ్లి సందడి నేపథ్యంలో వచ్చిన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది.. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

‘రారండోయ్ వేడుక చేద్దాం’ టీజర్ ను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend