కోదండరాం vs కేసీఆర్, పెద్దపల్లి కలెక్టర్ బ(ది)లీ


పెద్దపల్లి కలెక్టర్ ఆకస్మిక బదిలీ సంచలనం రేపుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక ఇంత అవమానకర రీతిలో కేసీఆర్ ప్రభుత్వం ఒక మహిళా కలెక్టర్ ను.. అదీ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరున్న ఐఏఎస్ అలుగు వర్షిణిని ట్రాన్స్ ఫర్ చేసింది. దానికి ప్రభుత్వం ఆమె అనారోగ్య కారణాలు కారణమని పైకి చెబుతోంది. కానీ కోదండరాంను కలవడానికి చర్చలు జరపడానికి ఆమె సమయం ఇవ్వడమే ఆమె బదిలీకి కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల రిజర్వాయర్ పనుల కోసం అధికారులు నిర్భంధంగా గోలీవాడ రైతుల భూములను లాక్కుంటున్నారు. దీనిపై స్థానిక గ్రామస్థులు పనులను అడ్డుకొని ఆందోళన చేశారు. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ అయిన అలుగు వర్షిణి రైతులను చర్చలకు కలెక్టరేట్ కు ఆహ్వానించారు. బాధితుల పక్షాన జేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్ గోలీవాడ నిర్వాసితులతో మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ మీటింగ్ పెట్టారు. కానీ ఈ విషయం తెలిసిన ప్రభుత్వం ఆఘమేఘాల మీద సీరియస్ అయ్యి.. ఆమెను సాయంత్రం 4 గంటలకు బదిలీ చేసిందట.. దీంతో మనస్తాపం చెందిన అలుగు వర్షిణి గంటలోపు జాయింట్ కలెక్టర్ కు బాధ్యతలు అప్పజెప్పి హైదరాబాద్ కు పెట్టాబేడా సర్ధుకుని పయనమైందట..

కలెక్టర్ కు జరిగిన అవమానంపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ కు జరిగిన అవమానం ఇదీ అని దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మరోలా వివరణ ఇస్తోంది. కలెక్టర్ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు సెలవు పెట్టింది. ఆమె ఆరోగ్యం బాగా లేదట.. రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో మరింత దీర్ఘకాలిక సెలువు కోసం ఆప్లై చేసినట్టు సమాచారం. అందుకే ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసిందని సమాచారం. కానీ కోదండరాంను కలిసే ముందే ఈ ఇన్సిడెంట్ జరగడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఐఏఎస్ అలుగు వర్షిణి గర్భవతి అని ఆమె కోరిక మేరకే ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసిందనే మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. మొత్తంగా కోదండరాంను కలుస్తానన్నందుకే కలెక్టర్ కు ఈ పరాభవం.. అని అందరినోళ్లలోకి వెళ్లింది.

To Top

Send this to a friend