కొబ్బరి నీళ్ళల్లో నిమ్మరసం

కొబ్బరి నీళ్ళల్లో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?!

కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన పానీయం. ఇది మందుల సైడ్ ఎఫెక్ట్స్ ని అరికట్టడంలో గొప్పగా సహాయ పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు.. రుచికరమైన పానీయం కూడా. ఇది చిన్న పిల్లలకు పూర్తి సురక్షితమైన పానీయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంతకూ కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం..
1)ఈ నీటితో పాటు.. తేనె కలిపి తీసుకున్నట్టయితే సమర్థవంతమైన టానిక్‌గా పని చేస్తుంది.
2)డీహైడ్రేషన్‌కు గురైన వారు ఎక్కువగా కొబ్బరి నీరు లేదా నిమ్మరసం తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
3)అంతేకాకుండా, కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బాక్టీరియాలను తొలగిస్తుంది.
4)కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటాయి.
5)ఇది అపరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, టైఫాయిడ్, మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్ళు వంటి వాటికి ప్రత్యేకంగా సహాయపడుతుంది.
6)వాంతుల దశలో ఉన్న పిల్లలు, గర్భణి మహిళలు, నిమ్మరసంతో కొబ్బరి నీరు ఇవ్వాలి. అజీర్తిని, అస్తమా, కడుపులో పుండు, నల్లటి మచ్చలు, మొటిమలను కూడా తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

To Top

Send this to a friend