ఎవరు ఎంత సేపు నిద్ర పోవాలో తెలుసా?

నిద్రలేమి కన్నా నిద్రలోంచి తరచూ లేస్తుండడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ హాని కలుగుతుందంటున్నారు అధ్యయనకారులు. ఈ అలవాటు వల్ల వ్యక్తులు బాగా అలసిపోతారంటున్నారు. అంతేకాదు జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. నలుగురితో హాయిగా మాట్లాడలేరు. సామాజిక సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోలేరు. ఎప్పుడూ అసహనంగా ఉంటారు. డిప్ర్‌స్డగా కూడా ఉంటారు. తరచూ నిద్రాభంగం కావడం వల్ల వ్యక్తుల మూడ్‌ మీద, ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. క్రానిక్‌ స్లీప్‌లెస్ నెస్ లో కూడా ఇలాగే అవుతుంది.

సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరంలో ఎనర్జీ తక్కువగా ఉంటుంది. తోటివాళ్లతో స్నేహంగా ఉండరు. ఎప్పుడూ విసుగ్గా, రెస్ట్‌లె్‌సగా ఉంటారు. రాత్రి నిద్ర ఆలస్యంగా పోయే వాళ్లల్లో కన్నా నిద్రాభంగం ఎక్కువ ఉన్నవాళ్లల్లో ఇలాంటి ప్రవర్తన బాగా కనిపిస్తుంది. బ్రెయిన కామ్‌నెస్ పై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇవన్నీ అధ్యయనకారులు చేసిన స్టడీలో వెల్లడయ్యాయి. జన్యుపరమైన అంశాలను కూడా ఈ స్టడీలో పరిశీలించారు. టీనేజర్స్‌ ప్రతి రోజు తొమ్మిది గంటలు నిద్రపోవాలి కానీ ఏడు గంటలే నిద్రపోతున్నారు. ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్లు స్కూళ్లకు వెళ్లాలి. నిద్రాభంగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా చదువులో వెనకబడతారు.

పిల్లల్లో డెవలప్‌మెంట్‌ ప్రక్రియ దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని స్టడీల్లో ఏడుగంటల కన్నా కూడా తక్కువ నిద్రపోయిన వారు తొమ్మిదిగంటలు నిద్రపోయేవారి కన్నా ఎక్కువ లావు అవుతారని తేలింది. రోజుకు ఏడు గంటల నుంచి 8.9 గంటల సేపు నిద్రపోతున్న వారు ఆరోగ్యవంతమైన శారీరక బరువును కలిగి ఉంటారని తేలింది. నిద్రలేమి రక్తపోటును పెంచుతుంది. స్ర్టెస్‌ హార్మోన్లు పెరుగుతాయి. ఇనఫ్లమేషన తలెత్తుతుంది. వీటన్నింటి వల్ల గుండె జబ్బులు రావొచ్చు. నిద్రలేమి జీవక్రియను కూడా దెబ్బతీస్తుంది. టైప్‌-2 డయాబెటిస్‌ వస్తుంది. జీవక్రియలో మార్పులు సంభవించడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది. సె్ట్రస్‌ హార్మోన్ల వల్ల పొట్ట చుట్టూ ఫ్యాట్‌ చేరుతుంది.

వ్యక్తులను బట్టి ఎంత సేపు నిద్రపోవాలి అన్నది కూడా ఉంటుంది. కొంతమంది ఆరుగంటలు పడుకుంటే సరిపోతుంది. కొందరు తప్పనిసరిగా తొమ్మిది గంటలు నిద్రపోవాలి. అడల్ట్స్‌ రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి. టీనేజర్లు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి. ఎవరైనా రెండు వారాలపాటు నిద్రపట్టకపోయినా, రెస్ట్‌లెస్ గా ఉన్నా ఫరవాలేదు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు ఈ సమస్యతో బాధపడుతుంటే మాత్రం వెంటనే స్లీప్‌ క్లినిక్‌ వెళ్లాలి. నిద్ర సమస్యను తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.

To Top

Send this to a friend