బిగ్ బాస్ కంటెస్టెంట్ జ్యోతి చేసిన పని..

బిగ్ బాస్ లో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన జ్యోతి తెలుసుగా.. ఆమె చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆ హౌస్ లోంచి వచ్చేశాక జ్యోతి వ్యవహరించిన తీరు అందరినోళ్లలో నానుతోంది.. తెలుగు టీవీ చానల్స్ లోనే ఓ సంచలనంగా నమోదై.. టీఆర్పీ రేటింగ్ లలో దూసుకుపోతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇందులోకి 14 మంది కంటెస్టెంట్ లు పోగా ప్రస్తుతం 12 మంది మిగిలారు.. సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా వెళ్లిపోగా.. దీక్ష అనే వర్థమాన నటి వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయ్యింది.

ఇక మొదటి వారం నటి జ్యోతి ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారం మధుప్రియను తీసేశారు.. ఇలా జోరుగా నడుస్తున్న ఈ షో రక్తి కడుతోంది..అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయిన జ్యోతికి బిగ్ బాస్ టీం దాదాపు 5 లక్షల పారితోషికం అందజేసినట్టు సమాచారం.

అది తీసుకొని హైదరాబాద్ కు రాగానే జ్యోతి తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అల్లరి సుభాషిణి వద్దకు వెళ్లిందట.. అమె హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటోంది. క్యాన్సర్ తో చావుకు దగ్గరైన ఆమెకు వెంటనే ఓ 50 వేల రూపాయలను తనవంతుగా అందించి ఉదారత చాటుకుందట.. తనకు వచ్చినవి రూ.5 లక్షలే అయినా.. ఆమెపై తన 11 ఏళ్ల కొడుకు ఆధారపడి ఉన్నా కూడా జ్యోతి పెద్ద మనసుతో రూ.50 వేలు అందించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. జ్యోతి చేసిన పనికి అందరూ మెచ్చుకోకుండా ఉండడం లేదు

To Top

Send this to a friend