కేకే పీచేముడ్.. పోరు కేసీఆర్ తో కాదు..


టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు పీచేముడ్ అయ్యారు. గోల్డ్ స్టోన్ అనే సంస్థ నుంచి ప్రభుత్వ, అటవీ భూములను తక్కువకు కొని లబ్ధిపొందారనే ఆరోపణలు కేకే పై వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది. దీంతో మొన్న తన భూములను రద్దు చేసిన కేసీఆర్ సర్కారుపై కోర్టులో తేల్చుకుంటానని చెప్పిన కేకే ఇప్పుడు మాట మార్చాడు. కేసీఆర్ పై, తమ ప్రభుత్వంపై పోరాడబోనని… మా సర్కారుకు వ్యతిరేకంగా కోర్టులో ఎలాంటి వ్యాజ్యం వేయనని స్పష్టం చేశారు.

కేకే… దండుమైలారంలోని హఫీజ్ పూర్ లో 50 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కొన్నాడు. ఇది అటవీ, ప్రభుత్వ భూమి అని తేలడంతో అప్రతిష్టపాలయ్యారు. అనంతరం  తన భూములు దక్కించుకునేందుకు ప్రభుత్వంపైనే పోరాడుతానన్నారు. కానీ కేసీఆర్, ఇతర ప్రభుత్వ పెద్దల నుంచి కేకేకు క్లాస్ పడడంతో తెల్లవారే మాట మార్చినట్టు తెలిసింది.

కేకే కొన్న భూముల ఖరీదును సదురు గోల్డ్ స్టోన్ నుంచి ఇప్పిస్తామని.. ఆ భూములను రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని కేకేకు టీఆర్ఎస్ పెద్దలు సూచించినట్టు తెలిసింది. అందుకే ఈరోజు.. ఆ భూములు సక్రమమో, అక్రమమో తెలియదు కానీ వివాదంలో ఉన్న భూములు కొని తాను నష్టపోయానని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఆ భూములను కోర్టులో ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్టు కేకే ప్రకటించారు. అయితే తనకు రిజిస్ట్రర్ చేసినందుకు సబ్ రిజిస్ట్రార్ సాలేహాను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని కేకే ప్రభుత్వానికి విన్నవించారు.

To Top

Send this to a friend