ఆగయా.. కిరణ్.. ఏ పార్టీలోకి.?

కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ సీరియస్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కిరణ్ తరువాత రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. సోనియాగాంధీ మాటనే ధిక్కరించి ఉమ్మడి ఏపీ కలిసి ఉండి తీరాల్సిందేనని మొండి పట్టు పట్టి మోకాలడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం.. కిరణ్ రాజీనామా చేయడం జరగిపోయింది.

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికల్లో ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని పెట్టి ఒంటరిగా ఏపీ బరిలో నిలిచారు. కానీ ఆయన పార్టీ బొక్కా బోర్ల పడింది. ఏ ఒక్కరు గెలవకపోగా.. ఆయన అసలు పోటీనే చేయలేదు. దీంతో రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం చేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

కొద్దిరోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. మొదట జనసేన పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరాలని ఆయన మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఏఐసీసీ నేతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. త్వరలోనే మళ్లీ కాంగ్రెస్ తరఫునే ఏపీలో కీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend