బీర్ పౌడర్ వైరల్.. ఇంతకీ అదేంటి.?

 

 

‘మందుతాగని వాడు దున్నపోతై పుట్టెను’ అని మందు బాబులు ఆడిపోసుకుంటారు.. మందుతాగి మహారాజులమైపోయామని ఫీలైపోతుంటారు.. ఈ సమాజంలో ప్రస్తుతం తాగుబోతుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇవాళా రేపు బీర్లను ఆడవాళ్లు కూడా తాగేస్తున్నారు. దీంతో బీరు గురించి వార్త అనే సరికి అందరూ షేర్ చేసేస్తున్నారు. ఇలాగే కింగ్ ఫిషర్ ప్యాకెట్ బీరు పౌడర్ అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

కింగ్ ఫిషర్ సంస్థ నుంచి ఓ బీరు పౌడర్ వచ్చిందని ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఇట్టే వ్యాపిస్తోంది. రెండు మూడురోజులుగా మన ఫోన్లలో కనిపిస్తున్న కింగ్ ఫిషర్ బీరు పౌడర్ ఆసక్తి రేపుతోంది.. కింగ్ ఫిషర్ సంస్థ నీళ్లలో కలుపుకునే తాగే బీరు పౌడర్ తయారు చేసిందని.. దాన్ని చల్లటి నీళ్లల్లో ఎంత కలుపుకుంటే అంత కిక్ ఇస్తుందని అందరూ ప్యాకెట్ గురించి వివరిస్తున్నారు… ఎంచక్కా ఇంట్లో ఉండే తాగేయచ్చని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

అయితే కొందరు దీన్ని వైన్ షాపులు, సూపర్ మార్కెట్లలో ఈ పౌచ్ కోసం వెతికి సంపాదించారట..కొందరు దొరికిన దాన్ని చింపి గ్లాస్ లో పోయడానికి ప్రయత్నించి షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో ఉన్నది బీరు పౌడరు కాదు. ఫిమేల్ కండోమ్.. మగవాళ్ల కోసం ఉన్నట్టే మహిళల కోసం కూడా కింగ్ ఫిషర్ సంస్థ దీన్ని తయారు చేసింది.. కానీ దాన్ని ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించింది.

కింగ్ ఫిషర్ ప్రీమియర్ , స్ట్రాంగ్ షాషేల పేరుతో రెండు ప్యాకెట్లను విడుదల చేసింది. లోపల ఏముందనేది పేర్కొనలేదు. దీంతో అది బీరు పౌడర్ అని అంతా షేర్ చేస్తున్నారు. నిజానికి అది మహిళలు వాడే కండోమ్. దాన్ని బీర్ పౌడర్ అని అందరూ షేర్ చేస్తుండడం గమనార్హం.

To Top

Send this to a friend