నాగ్‌ చిన్న బ్రేక్‌, చిటికెలో..!

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున ‘ఊపిరి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఓంకార్‌ దర్శకత్వంలో పీవీపీ నిర్మిస్తున్న ఆ సినిమా తర్వాత నాగార్జున నటించబోతున్న సినిమాపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘రాజుగారి గది 2’ చిత్రం తర్వాత నాగార్జున దాదాపు ఆరు నెలలు బ్రేక్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అఖిల్‌ రెండవ సినిమాను విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అఖిల్‌ మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో బాగా డిసప్పాయింట్‌ అయిన నాగార్జున రెండవ సినిమాతో తన కొడుకుకు ఎలాగైనా సక్సెస్‌ను ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్‌కు అఖిల్‌ను భారీగా చూపించే విషయంలో నాగార్జున ఏమాత్రం వెనుకాడటం లేదు. మొదటి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్‌తో అఖిల్‌ రెండవ సినిమా తెరకెక్కబోతుంది.

ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సినిమా రెండవ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. సినిమా షూటింగ్‌ను నాగార్జున దగ్గరుండి, అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశ్యంతో తన సినిమాలను పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరంలో నాగార్జున కొత్త సినిమా ప్రారంభం అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది. అఖిల్‌ రెండవ సినిమా పూర్తి అయ్యే వరకు నాగార్జున మరో ప్రాజెక్ట్‌ షురూ చేయడన్నమాట.

To Top

Send this to a friend